AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మఖానా ఎంత ఆరోగ్యకరమైనది? రోజూ ఎంత తినాలి, ఎవరు దీన్ని తినకూడదో తెలుసుకోండి!

మఖానా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే సూపర్‌ఫుడ్‌లలో ఇది ఒకటి. వీటిలో ఉండే పోషకాలు మనశరీరాన్ని ఆరోగ్యంగా ఉండడంతో ఎంతో సహాయపడుతాయి. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ దీన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి, దీన్ని ఎక్కవు తీసుకుంటే ఏమవుతుంది, దీన్ని ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది చాలా మందికి తెలియదు. అయితే ఈ అంశాలన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మఖానా ఎంత ఆరోగ్యకరమైనది? రోజూ ఎంత తినాలి, ఎవరు దీన్ని తినకూడదో తెలుసుకోండి!
How Healthy Is Makhana
Anand T
|

Updated on: Aug 12, 2025 | 6:37 PM

Share

మఖానా అనేది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజారోగ్యం అందించే ప్రజాదరణ పొందిన సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. దీన్ని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినమని చాలా మంది వైద్యులు కూడా సలహాలు ఇస్తుంటారు. వీటిని ముఖ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు, శరీరానికి అధిక పోషకాలు అవసరం అనుకునేవారు తీసుకుంటారు. మఖానాలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది బరువు తగ్గించే ప్రయత్నాలకు తోడ్పడుతుంది. ఈ మఖానా ఒకటి కంటే ఎక్కువ విధాలుగా మీ ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని సార్లు మనం అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం.. వీటి వల్ల ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా మఖానా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

1. పోషకాలు అధికంగా ఉంటాయి

మఖానాలలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తాయి.

2. బరువు తగ్గడానికి సహాయపడవచ్చు

మఖానా అనేది బరువు తగ్గడానికి అనుకూలమైన చిరుతిండి, ఇది మీరు ఎక్కువ ఫుడ్‌ను తీసుకోకుండా ఆకలి బాధలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. దీనిలోని అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, దీంతో మీకు ఎక్కువగా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గించే ప్రయత్నాలకు సహాయపడుతుంది. అంతేకాకుండా మఖానాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

3. రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది

మఖానాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రించబడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మఖానా యొక్క తక్కువ గ్లైసెమిక్ సూచిక కూడా మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి. మఖానాలో గ్లుటామైన్, సిస్టీన్, అర్జినిన్, మెథియోనిన్ వంటి చర్మ స్థితిస్థాపకతకు సహాయపడే అనేక అమైనో ఆమ్లాలు ఉంటాయి ఇవి చర్మం ముడతలు పడకుండా సహాయపడుతాయని నిపులణులు చెబుతన్నారు.

మఖానా అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?

ఏదైనా అధికంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. రోజుకు ఎక్కువ మఖానాలు తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు మోస్తరుగా 30 గ్రాములు మఖానా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా కాదని వీటిని మోతాదుకు మించి తీసుకుంటే మనం ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ తీసుకోవడం కొన్ని సార్లు జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే దీనిలో కాల్షియం పుల్కలంగా ఉంటుంది. కాల్షియం అధికంగా తీసుకుంటే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటిని అధికంగా తినడం వల్ల బరువు కూడా పెరగవచ్చు. కాబట్టి వైద్యులు వీటిని ఎంత మేర తీసుకోవాలని సిఫార్సు చేశారో అంతే పరిమాణంతో తినడం ఉత్తమం.

మఖానాను ఎవరు తినకూడదు.

ఎదైనా అలెర్జీ సమస్యలతో బాధపడేవారు. మఖానాను తమ ఆహారంలో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహాతీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించాలి. మూత్రపిండాల సమస్యలు, ఇతర సమస్యల కోసం మందులు వాడే వారు మఖానా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, నిపుణులు, ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన వివారాల ద్వారా అందజేయడమైనది. కావున ఈ అంశాలపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్, లేదా ఇతర వైద్యులను సంప్రదించండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.