మూత్రంతో రహస్య సందేశాలు.. వీటి రూటే సపరేటు బాసు!
రోడ్డు వెళ్లూ.. వెళ్లూ.. కారు టైర్లు, స్తంభాలు కనిపిస్తే వెంటనే వాటిపై కుక్కలు మూత్ర విసర్జన చేయడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. అవి ఎందుకు ఇలా చేస్తాయని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. నిజానికి ఈ అలవాటు వెనుక బలమైన కారణమే ఉంది. అదేంటంటే..
Updated on: Aug 12, 2025 | 6:53 PM

కారు టైర్లపై కుక్కలు మూత్ర విసర్జన చేయడం దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సీన్ ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. చాలా మందికి ఇదొక సాధారణ అలవాటులా అనిపించవచ్చు. కానీ కుక్కల ఈ ప్రవర్తన వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయట. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుక్కలకు తమ ప్రాంతాన్ని గుర్తు పెట్టుకునే అలవాటు ఉంటుంది. వాటిని గుర్తించడానికి అవి మూత్రాన్ని ఉపయోగిస్తాయి. అందువల్ల అవి తమ ప్రాంతం గురించి ఇతర కుక్కలకు చెప్పడానికి మూత్రాన్ని ఉపయోగిస్తాయి. ఇతర కుక్కలు కార్లపై లేదా స్తంభాలపై మూత్ర విసర్జన చేసే ప్రాంతాలకు అవి దూరంగా ఉంటాయి. మూత్రం నిర్దిష్ట వాసన ఆ ప్రాంతంలో ఇతర కుక్కలు ఇప్పటికే ఉన్నట్లు తెలియజేస్తుంది. తద్వారా అవి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉంటాయి.

కుక్కలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి మూత్రాన్ని ఉపయోగిస్తాయి. కుక్కలు ఎల్లప్పుడూ వాటి వాసన ఎక్కువసేపు ఉండే ప్రదేశాలలోనే మూత్ర విసర్జన చేస్తాయి. అవి నేలపై మూత్ర విసర్జన చేస్తే నీరు, దుమ్ము కారణంగా వాసన త్వరగా మాయమవుతుంది. అదే లోహపు స్తంభాలు, రబ్బరు టైర్లు వంటి వస్తువులపై మూత్రం వాసన ఎక్కువసేపు ఉంటుంది. అందుకే కుక్కలు నేరుగా నేలపై కాకుండా నిలువుగా , మన్నికైన వస్తువులపై మూత్ర విసర్జన చేయడానికి ఇష్టపడతాయి.

కుక్కలు భూభాగాన్ని గుర్తించడానికి మాత్రమే మూత్ర విసర్జన చేయవు. కొన్నిసార్లు ఇది వారి సహచరులకు, స్నేహితులకు ఒక ప్రత్యేక సందేశాన్ని మూత్ర వాసన ద్వారా అవి ఒకరినొకరు గుర్తిస్తాయి. దీని వలన కుక్కలు ఒకదానికొకటి ఆరోగ్యం, మానసిక స్థితి గురించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

కొన్నిసార్లు కుక్కలు తమ భావోద్వేగాలను కూడా ఇలా వ్యక్తపరుస్తాయి. అందుకే మూత్ర విసర్జన అనేది కుక్కలకు సహజమైన చర్య మాత్రమే కాదు. వాటి జీవన విధానంలో ఓ ముఖ్యమైన భాగం. ఈ కారణాలన్నింటి వల్ల కుక్కలు టైర్లు, స్తంభాలపై మూత్ర విసర్జన చేస్తాయి. ఈ అలవాటు వెనుక శాస్త్రీయ, సామాజిక కారణం ఉంది.




