High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువైతే కష్టమే.. ఈ పదార్థాలను దూరం పెడితే బెటర్..

|

Jul 07, 2022 | 9:30 PM

Cholesterol Foods: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులు కొన్ని పదార్థాలను తినడం మానుకోవాలి. ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువైతే కష్టమే.. ఈ పదార్థాలను దూరం పెడితే బెటర్..
Cholesterol
Follow us on

Cholesterol Foods: కొలెస్ట్రాల్ మన శరీరంలో మైనపు లాంటి పదార్థం. ఇది శరీరంలోని కణాలలో కనిపిస్తుంది. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL) అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉన్నాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని వల్ల శరీరంలో అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది కొలెస్ట్రాల్ రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న రోగులు కొన్ని ఆహారాలను తినకూడదని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే అలాంటి ఆహారం కొలెస్ట్రాల్‌కు హాని కలిగిస్తుంది. ఈ ఆహారాల గురించి తెలుసుకుందాం..

మటన్ నుంచి దూరంగా ఉంటే బెటర్..

మీరు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, రెడ్ మీట్ తినకపోవడం మంచింది. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చికెన్ తినొద్దు..

మీరు చికెన్‌ను ఇష్టపడితే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ కారణంగా చికెన్ తినకుండా ఉండటం మంచిది. వాస్తవానికి, మీరు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న చికెన్ తీసుకుంటే, అది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మరింత దిగజార్చుతుంది.

పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి..

కొలెస్ట్రాల్ రోగులు కనీసం పాల ఉత్పత్తులను తక్కువుగా తీసుకోవాలి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా ఫుల్ క్రీమ్ పాలు, దాని నుంచి తయారుచేసిన ఉత్పత్తులకు దూరం ఉంచడం మంచింది.