Rainbow Diet: రెయిన్‌బో డైట్‌తో ఆ వ్యాధులకు చెక్.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే?

Health Tips: ఇంద్రధనస్సులోని ప్రతీ రంగును ఆహారంలో చేర్చడం వల్ల శరీరంలో వివిధ పోషకాలు అందడమేకాక, చక్కని ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు..

Rainbow Diet: రెయిన్‌బో డైట్‌తో ఆ వ్యాధులకు చెక్.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే?
Rainbow Diet Health Benefits
Follow us

|

Updated on: Mar 02, 2022 | 1:14 PM

Rainbow Diet Health Benefits: ప్రపంచంలో అనేక రకాల ఆహారాలు ఉన్నప్పటికీ, వాటిలో ముఖ్యమైనది రెయిన్‌బో డైట్(Rainbow Diet) అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంద్రధనస్సులోని ప్రతీ రంగును ఆహారంలో చేర్చడం వల్ల శరీరంలో వివిధ పోషకాలు అందడమేకాక, చక్కని ఆరోగ్యం(Health Tips) కూడా సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీంతో జీవిత కాలాన్ని కూడా పొడిగిస్తుందని పేర్కొంటున్నారు. రెయిన్‌బో డైట్‌లో చేరిన ఆహారాలు(Foods), వాటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు ఆహారాలు..

ఎరుపు రంగులో ఉండే చాలా కూరగాయలు, పండ్లు మన హృదయానికి మేలు చేస్తాయి. రెడ్ బెల్ పెప్పర్స్, దానిమ్మపండ్లు, టమోటాలు, దుంపలు, పుచ్చకాయ, యాపిల్స్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అదనంగా, వాటి ఎరుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్ సమ్మేళనం కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతోంది.

నారింజ రంగు ఆహారాలు..

నారింజ రంగు పండ్లు, కూరగాయలలో కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, గుమ్మడికాయలు, క్యారెట్లు, పీచెస్ వంటివి కూడా జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

పసుపు రంగు ఆహారాలు..

బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, మామిడి, మొక్కజొన్న, పుచ్చకాయ వంటి పండ్లు, కూరగాయలలో లభించే బ్రోమెలైన్, పాపైన్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పసుపు రంగు ఆహారాలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్ పిగ్మెంట్లు వయస్సు సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి.

ఆకుపచ్చ రంగు ఆహారాలు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు పచ్చి కూరగాయలు, పండ్లు మనకు ఉత్తమమైనవని అంటున్నారు. ఇవి చాలా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం, గుండె జబ్బులతో పోరాడటానికి వీలు కల్పిస్తాయి. ఇందులో ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఆహారంలో బచ్చలికూర, మెంతులు, బతువా, క్యాబేజీ, బీన్స్, బఠానీలు, బ్రోకలీ, గుమ్మడికాయ, కాలే, పార్స్లీ, సెలెరీ, కివీ, దోసకాయ, ద్రాక్ష, గ్రీన్ యాపిల్, పుదీనాను చేర్చుకోవాలి.

నీలం లేదా ఊదా రంగు ఆహారం..

బెర్రీలు, ఎర్రటి కూరగాయలు, నల్ల ద్రాక్ష, వంకాయ, బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్ వంటివి మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్, రెస్వెట్రోల్ ఎలిమెంట్స్ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే, ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి.

తెలుపు రంగు ఆహారం..

బంగాళదుంపలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, అరటిపండ్లు, టర్నిప్‌లు వంటి ఆహారాలు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో శరీరాన్ని పోరాడేందుకు సిద్ధం చేస్తాయి. వాటిలో ఎక్కువ ఫైబర్, పొటాషియం ఉంటాయి.

రెయిన్‌బో డైట్‌ని తీసుకోవడం వల్ల మీరు ఆహారంలో అన్ని రంగులను అన్ని సమయాలలో చేర్చాలని కాదు. మీరు మీ ప్లేట్‌కి ఎన్ని రంగులు జోడించగలిగితే అంత మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక రోజులో 5 రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అలాగే వారంలో కనీసం 20 రకాల కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: Health Tips: ఈ 5 ఆహారాలతో జాగ్రత్త.. తింటే ప్రమాదమే.. అవేంటో తెలుసా!

Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే, ఆహారంలో వీటిని చేర్చండి..