Health Tips: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?.. జాగ్రత్త.. ఆ లోపానికి సంకేతం కావచ్చు..

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్ని విటమిన్లు, పోషకాలు ఎంతో అవసరం. అవాంటి వాటిలో కాల్షియం కూడా ఒకటి. కాల్షియం మన శరీరానికి పునాది లాంటిది. ఇది కరెక్ట్‌గా ఉన్నప్పుడు మన శరీరం మొత్తం బలంగా ఉంటుంది. కానీ మన శరీరంలో కాల్షియం స్థాయిలు కొంచెం తగ్గినా మనం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. కాబట్టి ఈ విటమిన్‌ లోపాన్ని మనం ఎలా గుర్తించాలి, దాని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

Health Tips: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?.. జాగ్రత్త.. ఆ లోపానికి సంకేతం కావచ్చు..
Calcium Deficiency Symptoms

Updated on: Sep 25, 2025 | 6:41 PM

మన శరీరానికి కాల్షియం ఎంత ముఖ్యమో కొందరు ఆరోగ్య నిపుణులు వివరించారు. కాల్షియం లోపం శరీరంలో అనేక ప్రతికూల మార్పులకు కారణమవుతుందని వారు చెబుతున్నారు. ఈ సమస్యను సకాలంలో నివారించడం చాలా ముఖ్యమని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తున్నారు. ఈ కాల్షియం లోపం వల్ల మొదట ఎముకలు బలహీనపడటం స్టార్ట్ అవుతుందని, దీర్ఘకాలంలో, ఇది బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది చెబుతున్నారు. అంటే చిన్న గాయాలు తగిలినా ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

కాల్షియం లోపం లక్షణాలు..

కండరాల నొప్పి: కాల్షియం లోపం వల్ల కండరాల బలహీనత, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో, వ్యాయామం చేసేటప్పుడు కండరాల తిమ్మిర్లు వస్తుంటాయి. ఎందుకంటే కండరాలు సాగడానికి, అవి బలంగా ఉండడానికి కాల్షియం ఎంతో అవసరం. దీని లోపం వాటి పనితీరును దెబ్బతీస్తుంది.

దంత సమస్యలు: కాల్షియం లోపం దంత ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పంటి ఎనామిల్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక వేళ అందులో కాల్సియం స్థాయిలు తగ్గితే దంతాలు బలహీనంగా మారుతాయి. అంతేకాకుండా ఇది దంతక్షయానికి కూడా దారితీస్తుంది. ఇది చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

హార్ట్‌బీట్‌లోల మార్పులు: గుండె ఆరోగ్యానికి కాల్షియం కూడా చాలా అవసరం. ఒక వేళ మీకు కాల్షియం లోపం ఉంటే రక్తపోటు, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులను చూస్తారు. గుండె, వాస్కులర్ ఆరోగ్యంపై ఈ ప్రభావం తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.

మెదడుపై ప్రభావం: కాల్షియం లోపం జ్ఞాపకశక్తి కోల్పోవడం, చిరాకు, నిద్రలేమికి కూడా కారణమవుతుంది. ఒక వేళ మీరు కాల్షయం లోపంతో బాధపడుతుంటే మీరు నాడీ సంబంధిత లక్షణాలలో బద్ధకం, ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతుంది.

కాల్షియం లోపాన్ని ఎలా అధిగమించాలి?

కాల్షియం లోపాన్ని అధిగమించడానికి మీరు మీ రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యం మీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, పాలకూర, నారింజ, బాదం వంటి వాటిని చేర్చుకోండి. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినండి, అవసరమైతే సప్లిమెంట్ల కోసం నిపుణుడిని సంప్రదించండి. మంచి ఆరోగ్యానికి కాల్షియం అవసరమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.