AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grilled Chicken: BBQ చికెన్ సీక్రెట్ మసాలా ఇదే! ఈ ఒక్కటి కలిపితే రుచి అదిరిపోతుంది..

సాధారణంగా రెస్టారెంట్లలో మాత్రమే దొరికే BBQ స్టైల్ గ్రిల్డ్ చికెన్ ను ఇప్పుడు మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన సువాసన, జూసీ టెక్చర్ , రుచి ఎవరినైనా కట్టిపడేస్తాయి. సరైన మ్యారినేషన్, సరైన పద్ధతిలో గ్రిల్ చేయడం చాలా ఈజీ. మరి ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Grilled Chicken: BBQ చికెన్ సీక్రెట్ మసాలా ఇదే! ఈ ఒక్కటి కలిపితే రుచి అదిరిపోతుంది..
Bbq Grilled Chicken Recipe
Bhavani
|

Updated on: Sep 25, 2025 | 5:27 PM

Share

ప్రస్తుతం BBQ (బార్బెక్యూ) స్టైల్ గ్రిల్డ్ చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. దీని ప్రత్యేకమైన రుచి, వాసన అందరినీ ఆకర్షిస్తుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అద్భుతమైన రుచి కోసం చికెన్ మ్యారినేషన్, బాస్టింగ్ పద్ధతులు చాలా ముఖ్యం.

తయారీకి కావలసినవి

చికెన్ లెగ్ లేదా బ్రెస్ట్ పీసులు, నిమ్మరసం. మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నూనె తీసుకోవాలి.

 బాస్టింగ్ సాస్‌‌కు:

మీకు ఇష్టమైన రెడీమేడ్ BBQ సాస్ – 1 కప్పు (లేదా టొమాటో కెచప్, బ్రౌన్ షుగర్ కలిపి తయారుచేసుకోవచ్చు)

తయారీ పద్ధతి

ముందుగా చికెన్ పీసులను శుభ్రం చేయండి. వాటిపై నిమ్మరసం చల్లి గాట్లు పెట్టండి. గాట్ల వల్ల మసాలా లోపలి వరకు వెళుతుంది.

ఒక గిన్నెలో మ్యారినేషన్ కు కావలసిన పదార్థాలు వేసి బాగా కలపండి.

ఈ మసాలాను చికెన్ కు చక్కగా పట్టించాలి. చికెన్ కనీసం 3 నుండి 4 గంటలపాటు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేయండి. రాత్రంతా మ్యారినేట్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది.

గ్రిల్ ను మధ్యస్థం నుండి అధిక వేడికి వేడి చేయాలి. గ్రిల్ రాడ్స్ కు నూనె రాయండి.

చికెన్ పీసులను గ్రిల్ మీద ఉంచి, ప్రతి 5 నుండి 7 నిమిషాలకు తిప్పుతూ వేయించాలి. సుమారు 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది.

చికెన్ ఉడికే దశకు చేరుకున్నప్పుడు, బ్రష్ సహాయంతో BBQ సాస్ ను చికెన్ కు రాయాలి. మరోసారి తిప్పి, మరో వైపు కూడా సాస్ రాయండి.

సాస్ రాసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా, చికెన్ తీయాలి. 5 నిమిషాలు ఆగిన తర్వాత వేడిగా వడ్డించాలి. దీనివల్ల చికెన్ మెత్తగా, జూసీగా ఉంటుంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!