Vitamin C Benefits: శరీరానికి విటమిస్ సీ కావాలంటే ఇవి తినాల్సిందే.. సహజంగా దొరికేవే.. మిస్ చేసుకుంటే చాలా నష్టం

|

Oct 14, 2021 | 9:20 PM

ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్ సీ చాలా ముఖ్యం. విటమిన్ సీ లోపంతో మన శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. జుట్టు, చర్మం, గోర్లు కూడా ప్రభావితమవుతాయి.

Vitamin C Benefits: శరీరానికి విటమిస్ సీ కావాలంటే ఇవి తినాల్సిందే.. సహజంగా దొరికేవే.. మిస్ చేసుకుంటే చాలా నష్టం
Vitamin C Foods
Follow us on

Health Benefits Of Vitamin C:రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి విటమిన్ సీ చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి విటమిన్ సీ ద్వారా బలపడుతుండనడంలో సందేహం లేదు. దీంతో శరీరం ఏదైనా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడగలిగేందుకు రెడీ అవుతుంది. యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సీలో పుష్కలంగా కనిపిస్తాయి. దీని కారణంగా శరీరం డిటాక్సిఫై, హానికరమైన పదార్థాలను బయటకు పంపించేందుకు సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సీ కూడా కీలకంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ముఖ్యంగా కరోనా సమయంలో, విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే. శరీరంలో విటమిన్ సీ లోపాన్ని భర్తీ చేయడానికి అనేక ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి.

విటమిన్ సీ రిచ్ ఫుడ్స్..
ఉసిరి- విటమిన్ సీ ఆమ్లాలో పుష్కలంగా లభిస్తుంది. ఆమ్లా విటమిన్ సీ స్టోర్‌హౌస్‌గా చెప్పుకోవచ్చు. ఆమ్లాలో 600 mg విటమిన్ సీ ఉంటుంది.

కూరగాయలు- విటమిన్ సీ కోసం మీరు కూరగాయలలో టమోటాలు తినవచ్చు. టమోటాలలో విటమిన్ సీ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అలాగే ఆకుపచ్చ కూరగాయలలో కూడా ఉంటుంది. మీరు బ్రకోలీ నుంచి విటమిన్ సీ పొందవచ్చు. బంగాళదుంపలు కూడా విటమిన్ సికి మంచి మూలం.

పండ్లు- శరీరంలో విటమిన్ సీ లోపాన్ని సులభంగా తీర్చగలవి కేవలం పండ్లు మాత్రమే. దీని కోసం మీరు కీవీ తినవచ్చు. కీవీలో విటమిన్ సీ, కే, ఈ ఉన్నాయి. అదే సమయంలో నారింజలో కంటే జామలో ఎక్కువ లభిస్తుంది. మరోవైపు బొప్పాయి అనేది అన్ని సీజన్లలో లభించే పండు. ఇందులో కూడా పుష్కలంగా విటమిన్ సీ లభిస్తుంది. ఇవి కాకుండా స్ట్రాబెర్రీలు, పైనాపిల్ కూడా విటమిన్ సీకి మంచి వనరులు. ఆరెంజ్ తినడం వల్ల కూడా విటమిన్ సీ లోపం తీరుతుంది.

నిమ్మకాయ- మీరు ఆహారంలో నిమ్మకాయను చేర్చితే.. దాని నుంచి శరీరానికి విటమిన్ సీ చాలా లభిస్తుంది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బరువును తగ్గిస్తుంది. జీవక్రియను బలపరుస్తుంది.

పప్పులు- ఆహారంలో పప్పులను చేర్చడం ద్వారా విటమిన్ సీ ని పొందవచ్చు. పొడి పప్పులో విటమిన్ సీ ఉండదు. కానీ, నానబెట్టిన తర్వాత వాటిలో విటమిన్ సీ చాలా చేరుతుంది. అందువల్ల, మీ రోజువారీ ఆహారంలో పప్పులను చేర్చండి. ఈ కారణంగా, శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది.

విటమిన్ సీ ప్రయోజనాలు
1- విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అలాగే శరీరం వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతోంది.
2- విటమిన్ సీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా శరీరం డిటాక్సిఫై అవుతుంది. దీంతో చర్మం స్మూత్‌గా ఉంటుంది.
3- విటమిన్ సీ ఐరన్ శోషణకు సహాయపడుతుంది
4- ఎముకలను బలపరుస్తుంది.
5- గాయాలను నయం చేస్తుంది. కంటి చూపు, గోరు సంబంధిత వ్యాధులకు విటమిన్ సీ కూడా చాలా ముఖ్యం.

విటమిన్ సీ లోపం లక్షణాలు
చిగుళ్లలో వాపు, రక్తస్రావం, దంతాల బలహీనత
చర్మంపై దద్దుర్లు
అలసట, బలహీనత, కీళ్ల నొప్పులు
త్వరగా జబ్బు పడటం, జలుబు దగ్గు లేదా ఇన్ఫెక్షన్
జుట్టు రాలడం, గోర్లు బలహీనపడటం

Also Read: Vitamin B12 Deficiency: ఈ లక్షణాలుంటే.. విటమిన్ బి 12 లోపం ఉన్నట్లే.. చెక్ పెట్టేందుకు ఇలా చేయండి..

Eye Care Tips: కళ్ళకు విశ్రాంతి లేదా.. ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి