ఇవి ఆకులు కాదు.. ఆ సమస్యలకు సంజీవని లాంటివి.. మధుమేహం, గుండె జబ్బులకు పవర్‌ఫుల్..

|

Oct 11, 2024 | 1:11 PM

ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. అలాంటి ఆకుకూరల్లో పాలకూర ఒకటి.. పాలకూర ఒక అద్భుతమైన ఆకు కూర అని మనందరికీ తెలుసు.. ఇది రుచికరమైనదే కాదు, ఆరోగ్యం పరంగా చూస్తే చాలా ప్రయోజనకరమైనది.

ఇవి ఆకులు కాదు.. ఆ సమస్యలకు సంజీవని లాంటివి.. మధుమేహం, గుండె జబ్బులకు పవర్‌ఫుల్..
Spinach
Follow us on

ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. అలాంటి ఆకుకూరల్లో పాలకూర ఒకటి.. పాలకూర ఒక అద్భుతమైన ఆకు కూర అని మనందరికీ తెలుసు.. ఇది రుచికరమైనదే కాదు, ఆరోగ్యం పరంగా చూస్తే చాలా ప్రయోజనకరమైనది. పాలకూరను విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ గొప్ప మూలంగా పరిగణిస్తారు. ఈ కూర మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనది.. డైటీషియన్ల ప్రకారం పాలకూరను రెగ్యులర్‌గా తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.. అలాగే పలు అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.. పాలకూర మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక ప్రమాదాలను తగ్గిస్తుంది.. దాని సాటిలేని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. మీరు కూడా ప్రతిరోజూ తింటారు..

పాలకూర తినడం వల్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఎప్పుడు తెలుసుకోండి..

  1. డయాబెటిస్ లో మేలు చేస్తుంది: పాలకూర వినియోగం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని ప్రోత్సహిస్తుంది.
  2. శక్తిని ఇస్తుంది : పాలకూరలో ఫైబర్, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక శక్తిని అందిస్తాయి. దీని ద్వారా అలసట తగ్గుతుంది.
  3. కళ్లకు మేలు చేస్తుంది: పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ కె, లుటిన్ వంటి ప్రత్యేక పోషకాలు ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.
  4. ఎముకలకు మేలు చేస్తుంది: పాలకూరలో విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులను నివారిస్తాయి.
  5. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది: పాలకూరలో ఫైబర్ ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  6. చర్మానికి మేలు చేస్తుంది: పాలకూరలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.
  7. బరువు అదుపులో ఉంటుంది: పాలకూర ఆకుకూరలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
  8. గుండె ఆరోగ్యానికి అవసరం: పాలకూరలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  9. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది: పాలకూరలో ఫోలేట్ ఉంటుంది. ఇది డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  10. నిర్విషీకరణ: వాస్తవానికి పాలకూర ఒక్కటే కాదు.. ఆకు కూరలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.. ఇవి శారీరకంగా సూక్ష్మక్రిములను నాశనం చేయడంలో సహాయపడతాయి.. అలాగే శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి