
చాలా మంది రాత్రిపూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు.. మరికొందరు ఉదయం ఖాళీ కడుపుతో కిస్మిస్ నీరు కూడా తాగుతుంటారు. అయితే, ఆరోగ్య పరంగా ఇది మంచిదేనా?
అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కలిగే ఫలితాల్లేంటో పోషకారహార నిపుణులు ఏం చెబుతున్నారో పూర్తి వివరాల్లోకి వెళితే…
కిస్మిస్ పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన డ్రై ఫ్రూట్. కిస్మిస్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు కిస్మిస్ నీరు తాగడం కూడా ఆరోగ్యానికి అంతే ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. కిస్మిస్ నీరు శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్స్లను తొలగిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉన్నప్పటికీ నానబెట్టడం వల్ల రక్తప్రవాహంలో వాటి విడుదలను నియంత్రిస్తుంది. పైగా మధుమేహ రోగులకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది.
అంతేకాకుండా కిస్మిస్ నీరు తాగడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. కిస్మిస్ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. కిస్మిస్ నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు కూడా బలంగా మారుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..