Hing With Ghee Benefits: ఇంగువ, నెయ్యి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంగువ, నెయ్యిలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువ, నెయ్యిలో ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ కె, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. మరోవైపు, ఇంగువలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, రైబోఫ్లావిన్, కార్బోహైడ్రేట్లు సమృద్దిగా ఉంటాయి. ఇంగువ, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇంగువ, నెయ్యిలో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. ఇంగువ, నెయ్యి కలిపి తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో పొత్తి కడుపు తిమ్మిరి, అజీర్ణం, గ్యాస్, నొప్పి నుండి ఉపశమనం కలిగించటానికి సహాయ పడుతుంది. ఇంగువ, నెయ్యిలో కాల్షియం సమృద్దిగా ఉండటం వల్ల ఎముకలు గుల్లగా మారకుండా దృఢంగా, బలంగా ఉండేలా చేసి వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు రాకుండా చేస్తుంది.
ఇంగువ, నెయ్యి కలిపి తీసుకోవటం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ఎముకల మధ్య రాపిడి కూడా తగ్గుతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇంగువ, నెయ్యిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతి రోజూ ఉదయం తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి, మెదడులోని రక్తనాళాలను శాంతపరచి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. నెయ్యి, ఇంగువా కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
ఇంగువ,నెయ్యి మిశ్రమంలో తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సీజన్ లో వచ్చే శ్వాస సంబంద సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. అరస్పూన్ నెయ్యిలో చిటికెడు ఇంగువ కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. తలనొప్పి, వాంతులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఇంగువ, నెయ్యి సహాయపడతాయి. పిల్లల్లో వచ్చే నులి పురుగుల సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..