పచ్చి మిరపకాయలు (Green Chilli) వంటకు మరింత రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు.. కేవలం వంటకాలలో మరింత రుచిని పెంచడానికి ఇపయోగిస్తారు. కానీ పచ్చిమిరపకాయ పచ్చడి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో ఎక్కువగా ఊరగాయలు పెడుతుంటారు. మామిడి, నిమ్మకాయ, వెల్లుల్లి, మిరపకాయలు ఇలా అన్నింటితో ఊరగాయలను తయారు చేస్తుంటారు. పచ్చి మిరపకాయ ఎంత ఘాటుగా ఉంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. మిరపకాయ అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీనివలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.
పచ్చి మిరపకాయ పచ్చడి తినడం వలన కలిగే ప్రయోజనాలు..
పేగు ఆరోగ్యానికి మేలు చేసే ఊరగాయలో కర్కుమిన్ పుష్కలంగా ఉండే పసుపు ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి బాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి శరీరానికి సహాయపడతాయి. ఇవి మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి అంతేకాకుండా జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. మిరపకాయ పచ్చడిని తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిరపకాయ పచ్చడిని తక్కువగా తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. మిరపకాయల్లో ఉండే విటమిన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి బరువును తగ్గిస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం మాత్రం మంచిది కాదు. పచ్చి మిరపకాయను వెనిగర్‌లో తయారు చేస్తే, దానిలో కేలరీలు ఉండవు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మిరపకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. దీనితో పాటు ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నియంత్రిస్తుంది.
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.
Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..
RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..
Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..