AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Litchi Benefits: లిచీ పండ్లతో లాభాలు తెలుసా? ఆరోగ్యానికి ఇది దివ్య ఫలం..ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!

లిచీ పండు తిన్న వారికి రక్తహీనత దరిచేరదు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరగడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు త్వరగా బరువు తగ్గడంలో లీచీ సహాయపడుతుంది. లీచీ పండులో ఫైబర్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ స్వీట్ ఫ్రూట్ మన శరీరంలోని అనవసరమైన కొవ్వులను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో

Litchi Benefits: లిచీ పండ్లతో లాభాలు తెలుసా? ఆరోగ్యానికి ఇది దివ్య ఫలం..ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Lychee Fruits
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2023 | 10:05 AM

Share

బయటికి కరుకుగా కనిపించే వ్యక్తులు లీచీ పండులా చాలా మృదుస్వభావం కలిగి ఉంటారు. ఈ పండు చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ లీచీలో పెద్ద వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. ఇది కేవ‌లం రుచి, సువాస‌న మాత్ర‌మే కాదు.. అద్భుత‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ చిన్ని పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇది సాధారణ గుండె లయను అందిస్తుంది. లీచీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఒక పరిశోధన జరిగింది. ఈ పరిశోధన లిచీ ఆరోగ్యానికి దివ్యౌషధంగా తేలింది. ఊబకాయం, మధుమేహం, పక్షవాతం, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అందుకే లీచీని మన జీవితంలో ముఖ్యమైన భాగంగా చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం.

లిచీ పండులో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్, బి-కాంప్లెక్స్ ఉన్నాయి. ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, లిచీ మన శరీరానికి రక్త ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది RBC ఏర్పడటానికి అవసరమైన మాంగనీస్, మెగ్నీషియం, రాగి, ఇనుమును అందిస్తుంది. లీచీ పండు ప్రయోజనాలు నిజంగా మరే ఇతర పండ్లతో పోల్చలేనివి. మీ ముఖ సౌందర్యాన్ని పెంచే అద్భుత సామర్థ్యం లీచీకి ఉంది. ఈ పండు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను అందించడం ద్వారా మీ జుట్టుకు పోషణను అందిస్తుంది. బ్యూటిఫైయింగ్ ప్రక్రియతో పాటు, ఈ అద్భుత పండు దెబ్బతిన్న చర్మాన్ని త్వరగా పునరుద్ధరించగలదు. లీచీ లాంటి చిన్న పండులో ఇన్ని ఆరోగ్య సంపదలు ఎలా ఉంటాయని పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు.

వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉండే లిచీ పండ్లలో విటమిన్ సి, ఐరన్‌ను గ్రహించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. అందువల్ల లిచీ పండు తిన్న వారికి రక్తహీనత దరిచేరదు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరగడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు త్వరగా బరువు తగ్గడంలో లీచీ సహాయపడుతుంది. లీచీ పండులో ఫైబర్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ స్వీట్ ఫ్రూట్ మన శరీరంలోని అనవసరమైన కొవ్వులను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో లీచీని తీసుకోవడం వల్ల నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. జీవక్రియను పెంచుకోవాలనుకునే వారు ఈ ఎర్రటి పండును తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. లీచీ వేసవిలో లభించే సీజనల్ పండు. లిచీ బరువు తగ్గడానికి ఉత్తమమైన పండు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీవక్రియ కూడా బలపడుతుంది.

ఇవి కూడా చదవండి

లీచీలో మంచి మొత్తంలో ఫైబర్, జీర్ణవ్యవస్థను బలోపేతం చేసే ఇతర పోషకాలు కూడా అనేకం ఉన్నాయి. చర్మ రక్షణకు కూడా లీచీ ప్రయోజనకరంగా ఉంటుంది. లిచీ తినడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. లీచీ తినడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..