
మనిషి శరీరంలో కాలేయం ముఖ్యమైన అవయవం. కాబట్టి, దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, ఇది ఎన్నో పనులను చేస్తుంది. ఎంతో మంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు.

వ్యాయామం : చాలా మంది తమ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. దీని వలన వ్యాయామం చెయ్యడానికి కూడా సమయం లేదు. అలాగే, ఆఫీసుల్లో పని చేస్తూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలు బిజీ లైఫ్‌స్టైల్ వల్లే అని వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కదలకుండా ఒక చోట కూర్చోవడం వలన ఇన్సులిన్ పెరిగి కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.

గ్రీన్ టీ, బ్లూ కాఫీ : మారుతున్న జీవనశైలిలో మనిషి కొత్త అలవాట్లను నేర్చుకుంటున్నాడు. చాలా మంది ఉదయం లేవగానే గ్రీన్ టీ, బ్లూ కాఫీ, బ్లాక్ కాఫీ వంటి తీసుకుంటారు. ఈ సహజ సప్లిమెంట్లను డాక్టర్లు చెప్పకుండా వాటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మీ లివర్ ను పాడు చేస్తాయని అంటున్నారు.

జంక్ ఫుడ్స్ : బయట దొరికే జంక్ ఫుడ్స్ ను అతిగా తింటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే, దానిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకుంటే లివర్ దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. చిప్స్, బఠాణి వంటి ఫుడ్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు మీ కాలేయానికీ మంచివి కావు. కాబట్టి, సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.

ప్రాసెస్ చేసిన నాన్ వెజ్ : ప్రాసెస్ చేసిన ఏ నాన్ వెజ్ తిన్నా మీ కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే, దీనిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ మాంసంలో ఉండే నైట్రేట్లు లివర్ ను దెబ్బ తీస్తాయి. ఈ ప్రాసెస్ ఫుడ్ ను తింటే ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.