Healthy Tips: ఎండకాలంలో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఇక వేసవిలో చర్మాన్ని ఎప్పుడూ అందంగా ఉండేలా చూసుకుంటారు.. కానీ చాలా సందర్బాల్లో చర్మ సమస్యల బారిన పడిపోతుంటారు. అయితే ఈ వేసవిలో ఏర్పడే కోన్ని రకాల చర్మ సమస్యలకు ప్రస్తుత పరిస్థితులలో ఇంట్లోనే ఎలా ట్రీట్ మెంట్ తీసుకోవాలో తెలుసుకుందాం.
స్వేద గ్రంధులు మూసుకు పోవడం వల్ల ఈ చెమటకాయల సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు చెమట కాయలు ఉన్న ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది, మండినట్లుగా ఉంటుంది. సింథటిక్ దుస్తులు వేసుకునే వారు ఎక్కువగా ఈ సమస్యకి గురవుతారు. ఈ సమస్య ఉన్నప్పుడు చేయవలసిన మొదటి పని ఆ ప్రదేశంలో దుస్తులు తప్పించి, గాలి ఆడేలా చేసి చల్లని నీరు చల్లడం. కాసేపు అలాగే ఉంచేసి టాల్కం పౌడర్, లేదా శాండల్ వుడ్ పౌడర్ ఉపయోగించాలి. దీనికి కలబందను కూడా వాడవచ్చు. ముఖ్యంగా సమ్మర్లో వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం ఉత్తమం.
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంది. మజ్జిగ తీసుకుని అందులో ఒక కాటన్ బాల్ ముంచి ఆ బాల్ తో డార్క్ స్పాట్స్ మీద తుడవండి. పావుగంట అలాగే ఉంచి ఆ తరువాత కడిగేయండి. అలాగే, రెండు టీ స్పూన్ల ఓట్మీల్ తీసుకుని దానికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని స్కిన్ మీద అప్లై చేయండి. కొన్ని నిమిషాల తరువాత కడిగేయండి.
సన్ బర్న్ వల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అయితే అది స్కిన్ పీలింగ్ కి దారి తీస్తుంది. ఇది బాగా పెయిన్ ఫుల్ గా కూడా ఉంటుంది. చల్లని నీరు తీసుకుని అందులో ఒక కాటన్ క్లాత్ ముంచి దీన్ని కోల్డ్ కంప్రెస్ లాగా స్కిన్ మీద ఉంచండి. అలాగే, కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కిన్ కి కావాల్సిన మాయిశ్చరైజేషన్ లభిస్తుంది. ఎంత వేడిగా ఉన్నా కూడా ఈ ఏరియాని రబ్ చేయడం కానీ, ఐస్ అప్లై చేయడం కానీ చేయకండి. అలాగే, పెరుగు అప్లై చేయడం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది.
1. వేసవిలో మేకప్ తక్కువగా వేసుకోండి. ఒకవేళ ఫౌండేషన్ వేసుకున్నట్లయితే ఎస్‌పీఎఫ్ ఉన్న టింటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది.
2. మీ డైట్ లో తాజా పండ్లూ, కూరగాయలూ తీసుకోండి. ఈ సీజన్ లో లభిచే వాటిని తినడం ఎంతో మేలు చేస్తుంది.
3. మీరు తీసుకునే సీరమ్స్, మాయిశ్చరైజర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండేలా చూసుకోండి.
4. తగినంత నీరు తాగండి. మీరు బయటకి వెళ్ళవలసి వస్తే మీతో పాటూ ఒక వాటర్ బాటిల్ నిండుగా నీరు తీసుకుని వెళ్ళండి.
5. చల్లని నీటితో స్నానం చేయండి. అలాగే ఎండలో బయటకి వెళ్ళవలసి వస్తే సన్ గ్లాసెస్ యూజ్ చేయండి.
6. హెవీ మాయిశ్చరైజర్స్ బదులు లైట్ మాయిశ్చరైజర్స్ తీసుకోండి.
7. హెవీ మాయిశ్చరైజర్స్ బదులు లైట్ మాయిశ్చరైజర్స్ తీసుకోండి.
8. మీ స్కిన్ ఎక్కువ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి తగినట్లుగా మీ ఫేస్ వాష్ ఉండాలి.
9. మీరు తీసుకునే సీరమ్స్, మాయిశ్చరైజర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండేలా చూసుకోండి.
Also Read: సోనూసూద్ బాటలో మరో బాలీవుడ్ నటుడు.. కరోనా పేషెంట్ల కోసం ఆసుపత్రి నిర్మించనున్న గుర్మీత్..