Milk with Flax Seeds Benefits: అవిసె గింజలతో కలిపిన పాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. ఆ సమస్యలన్నింటికీ చెక్‌..

|

Aug 05, 2023 | 1:14 PM

రీరానికి అవసరమైన ఫైబర్‌తో అవిసె గింజలు సమృద్ధిగా చేస్తుంది. అవిసె గింజలను పాలలో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, బీపీ, షుగర్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఇంకా అనేక వ్యాధులకు దివ్యౌషధం అవిసెగింజలు.

Milk with Flax Seeds Benefits: అవిసె గింజలతో కలిపిన పాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. ఆ సమస్యలన్నింటికీ చెక్‌..
Milk With Flax Seeds
Follow us on

Milk and Flax Seeds Benefits: పాలు ఆరోగ్యానికి బలవర్ధకమైన ఆహారం. పాలలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే.. పాలను అవిసె గింజలతో కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..? ఈ ఆహారం..మీ ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన అవిసె గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సరైన మార్గంలో వీటిని వినియోగిస్తే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అవిసె గింజలతో మధుమేహం నుండి బరువు తగ్గడం వరకు అన్నింటికీ ఉపయోగపడుతుంది. ఇది కరిగే, కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటుంది. శరీరానికి అవసరమైన ఫైబర్‌తో అవిసె గింజలు సమృద్ధిగా చేస్తుంది. అవిసె గింజలను పాలలో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, బీపీ, షుగర్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఇంకా అనేక వ్యాధులకు దివ్యౌషధం అవిసెగింజలు.

అవిసె గింజలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

1. అవిసె గింజలను పాలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు చాలా ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంటే, అవిసె గింజలు తినడం ద్వారా జంక్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

2. అవిసె గింజలను పాలతో కలిపి తింటే శరీరానికి మరింత శక్తి వస్తుంది. ఇందులో చాలా ప్రొటీన్లు ఉంటాయి. సోమరితనాన్ని పోగొట్టడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. అవిసె గింజలలో ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే మెదడు కణాలను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

4. మలబద్ధకంతో బాధపడేవారికి అవిసె గింజలు చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది.

5. మంచి నిద్రకు అవిసె గింజలు మంచివి. ఇందుకోసం అవిసె పొడిని పాలలో కలుపుకుని పడుకునే ముందు తాగాలి. పడుకునే ముందు ఇలా పాలు తాగడం అలవాటు చేసుకుంటే.. అందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి చక్కటి నిద్రను పొందేందుకు ఉపయోగపడుతుంది.

6. మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలతో అవిసె గింజలను తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..