Iron Foods: నిర్దిష్ట వయసు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో ఐరన్‌లోపం ఏర్పడుతుంది. ఇది మహిళలలో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనత వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎముకలు పెలుసుగా మారుతాయి. ఐరన్ లోపం శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల కొరతను సూచిస్తుంది. దీని కారణంగా హిమోగ్లోబిన్ పడిపోతుంది. కాబట్టి ఐరన్ లభించే ఆహారాలు కచ్చితంగా డైట్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి. సహజంగా శరీరంలో ఐరన్ స్థాయిలు పెంచుకోవడానికి ఈ ఐదు ఆహరాలు సూపర్‌గా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
1. బచ్చలికూర
బచ్చలికూర కండరాలకు చాలా మంచిది. ఇది అధిక మొత్తంలో ఇనుమును కలిగి ఉంటుంది. వారానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.
2. కాలేయం, మూత్రపిండాలు
జంతువుల కాలేయం, మూత్రపిండాలు, మెదడు, గుండెలాంటి అవయవాలలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. కాలేయంలో ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పశువుల కాలేయం చిన్న ముక్కలో 36% ఐరన్ ఉంటుంది. అప్పుడప్పుడు వీటిని తీసుకోవాలి.
3. బెల్లం
బెల్లం శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. చక్కెర కంటే మేలైనది. మీ రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. రెగ్యులర్‌గా వాడే వైట్ షుగర్‌ని బెల్లంతో భర్తీ చేయడం వల్ల మీ ఆహారంలో ఎక్కువ ఐరన్‌ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కూడా.
4. ఉసిరి
ఉసిరి ఒక సూపర్ ఫుడ్. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఉసిరి రక్తహీనతను నయం చేస్తుంది. ఇది ఊరగాయలు, క్యాండీల వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఉసిరికాయను ఉడకబెట్టి పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజూ తినే ఒక్క ఉసిరి రక్తం, శరీరానికి అద్భుతంగా పనిచేస్తుంది.
5. నానబెట్టిన ఎండుద్రాక్ష
చాలా డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ ఉంటుంది. ఎండుద్రాక్షలో ఎక్కువగా ఉంటుంది. రక్త కణాల నిర్మాణానికి అవసరమైన రాగి, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు తినడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.