Elephant Foot Yum: మంచి ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే.. ఈ ఒక్క కూరగాయ తింటే చాలు..! మటన్‌కర్రీకి మించి..

|

Feb 09, 2024 | 7:39 AM

ఆయుర్వేదం ప్రకారం దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. కందలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కడుపు, మలబద్ధకం, పైల్స్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరం. ఎందుకంటే కంద తినటం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.

Elephant Foot Yum: మంచి ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే.. ఈ ఒక్క కూరగాయ తింటే చాలు..! మటన్‌కర్రీకి మించి..
Elephant Foot Yum
Follow us on

Elephant Foot Yum: ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం తినే ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా మంది కూరగాయలు తినడానికి ఇష్టపడరు. కానీ కూరగాయలలో మంచి పోషకాలు ఉంటాయి. మరికొందరు కూరగాయలనే ఇష్టంగా తింటారు. కానీ, కూరగాయల్లో లభించే ఈ బంగారు గడ్డను చాలా మంది తినరు. మనం దీనిని కంద గడ్డ అంటాం. ఇంగ్లీషులో ఏనుగు పాదం(Elephant Foot Yum) అంటారు. ఎందుకంటే కంద గడ్డను మనం రెండుగా కట్ చేస్తే అది రెండు ఏనుగు పాదాల్లా కనిపిస్తుంది. చాలామంది దీనిని ‘అడవి కూరగాయలు’ అని కూడా పిలుస్తారు. కొందరు మాత్రం దీపావళి రోజున ఈ కూరగాయ తినడం శుభప్రదంగా భావిస్తారు. ఈ కూరగాయ గురించి చాలా మందికి తెలియదు. బంగారు దుంపలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అంతే కాకుండా ఈ బంగారు గడ్డను తింటే అనేక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అంతేకాదు.. శాకాహారులకు ఇది మటన్‌తో సమానం.. ! ఏనుగు పాదం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంద ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి1, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది కాకుండా, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా లభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. కందలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కడుపు, మలబద్ధకం, పైల్స్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరం. ఎందుకంటే కంద తినటం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.

కొలెస్ట్రాల్: ఇప్పుడు చాలా మంది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడంతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ గుండె సమస్యలు, బరువు పెరగడం మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఈ ఏనుగు పాదం యం తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మం అందంగా ఉంటుంది: కందగడ్డలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి6 మరియు బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేస్తుంది. అలాగే, ఇది జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ఈ బంగారు ముద్దను రోజూ తింటే.. అందంగా కనిపిస్తారు.

మధుమేహం: మధుమేహంతో బాధపడేవారు బంగారు దుంప తింటే మంచి ఫలితాలు ఉంటాయి. కందగడ్డలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధు మైహం ఉన్నవారు ఇది తింటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.

శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది: బంగారు గడ్డ దినుసు తినడం వల్ల శరీరం నుండి మలినాలను, విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. ఫైల్స్ వంటి సమస్యలకు కూడా కందగడ్డ మంచి ఔషధంగా పనిచేస్తుంది. నిత్యం గడ్డ కూరలు తింటే పేగులు, కాలేయం, పొట్ట శుభ్రంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.