Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ ట్రై చేయండి.! ఆ సమస్యలన్నింటికీ టాటా… బై బై చెప్పేయండి..

|

Mar 21, 2023 | 4:06 PM

ఈ జ్యూస్‌లో విటమిన్ డితో పాటు, కాపర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు B1, B2, B6, C, E బీటా-కెరోటిన్‌ కూడా అంతే మొత్తంలో ఉన్నాయి.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ ట్రై చేయండి.! ఆ సమస్యలన్నింటికీ టాటా... బై బై చెప్పేయండి..
Pumpkin Juice
Follow us on

కీళ్ల నొప్పుల సమస్య లేదా అలసట సమస్య కావచ్చు, శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముడతాయి. అయితే గుమ్మడికాయ రసం ఈ లోపాన్ని సహజంగానే నయం చేస్తుందని తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. గుమ్మడి జ్యూస్‌లో విటమిన్ డితో పాటు, కాపర్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు B1, B2, B6, C, E బీటా-కెరోటిన్‌ కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. గుమ్మడికాయ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయ రసం తాగడం వల్ల చాలా సంవత్సరాల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. గుమ్మడికాయ రసం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మలబద్ధకం, అల్సర్, గ్యాస్ సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండ వ్యవస్థను బలోపేతం చేయడానికి, అన్ని రకాల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రోజుల్లో నిద్రలేమి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి తేనెతో కలిపి గుమ్మడికాయ రసం తాగాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్రపడుతుంది. హెయిర్ హెల్తీగా ఉంచుతుంది. మీకు ఎక్కువగా జుట్టు రాలుతున్నట్లయితే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ రసం త్రాగండి. ఇది జుట్టు పెరుగుదలను ప్రొత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..