సాధారణంగా శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తినరు. ఇందుకు చాలానే కారణాలున్నాయనుకోండి. ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రావణ మాసంలో ఎక్కువగా వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం.. వ్రతాన్ని జరిపించుకోవడం ఆనవాయితీ. దీంతో చాలావరుకు ఈ నెలలో మాంసం ముట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే మరికొందరు ఈ నెలలో పాలు, పెరుగు కూడా తినకూడదు అంటుంటారు. పాలు, పెరుగులలో అనేక రకాల పోషకాలుంటాయి. మరీ ఆరోగ్యానికి ప్రయోజనాలిచ్చే పాలు, పెరుగు శ్రావణ మాసంలో ఎందుకు తినకూడదో తెలుసుకుందామా.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అలాగే వాతావరణంలో ఎన్నో రకాల కీటకాలు కూడా బ్యాక్టీరియాకు కూడా మొక్కలపై ఏర్పడుతుంటాయి. వాటిని తీసుకున్న గేదెలు, ఆవులు వర్షాకాలంలో ఎక్కుగా జబ్బు పడుతుంటాయి. అంతేకాకుండా.. పాలలో, పెరుగులో కూడా హనికరమైన కీటకాలు వచ్చే ప్రమాదముంటుందని.. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా పాలు, పెరుగు తీసుకోకూడదని అంటుంటారు. అలాగే వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ తరచుగా బలహీనపడుతుంది. ఈ నెలలో పాలు, పెరుగు తీసుకోవడం వలన తరచుగా అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఎసిడిటి వంటి కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఈ నెలలో పాలు, పెరుగు, వాటి నుండి తయారైన వస్తువులను తినవద్దని సలహా ఇస్తారు. అలాగే వర్షాకాలంలో పాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం వలన జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో పాటు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటుంటారు.
Also Read: