ఈ “టీ” రోజూ ఒక్కకప్పు తాగండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే!

మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం ఎంత ముఖ్యమో.. మనం తిన్నిది సరిగ్గా జీర్ణమైన శరీరభాగాల్లోకి వెళ్లడం కూడా అంతే ముఖ్యం. మారుతున్న లైఫ్‌స్టైన్‌ ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి తిన్నవెంటనే గ్యాస్‌, అజీర్తి వంటి అసౌకర్యం కలుగుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసెన్‌ వాడుతూ ఉంటారు. కానీ దీని మన ఇంట్లోనే ఒక సులభమైన పరిష్కారం ఉందని చాలా మంది తెలియదు.. అదేంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అది ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ టీ రోజూ ఒక్కకప్పు తాగండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే!
Clove Tea

Updated on: Aug 25, 2025 | 2:28 PM

మారుతున్న లైఫ్‌స్టైన్‌ ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి తిన్నవెంటనే గ్యాస్‌, అజీర్తి వంటి అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటి సమస్యతో బాధపే వారికి లవంగాల టీ ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే లవంగంలో ఉండే ‘యూజినాల్’ అనే శక్తివంతమైన సమ్మేళనం మన కడుపులోని కండరాలకు ఉపశమనం కలిగించి, గ్యాస్ ఏర్పడటాన్ని వెంటనే నివారిస్తుంది. దానీ ద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల వెంటనే తగ్గిపోతాయి. దీని వల్ల మనం ఎంతో ఉపశమనం పొందవచ్చు.

ఇది కూడా చదవండి: ఇదే మీ వ్యక్తిత్వం.. నిద్రించే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలానో తెలుసా

ఈ లవంగాల టీ ఒక్క జీర్ణవ్యవస్థకే కాకుండా డయాబెటీస్‌తో బాధపడేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల ప్రకారం, లవంగాలలో ఉండే కొన్ని పోషకాలు మన శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచేందుకు దోహదపడుతాయని తేలింది. మనం భోజనం చేసిన వెంటనే ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించేందుకు ఇది సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు!

అలాగనే లవంగాల టీ మన శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై, ఆహారంలోని పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహించడానికి తోల్పడుతుంది. దీనితో పాటు లవంగాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో అంతర్గత వాపులను , రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రోజు ఒకకప్పు లవంగం టీ తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు అందుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.