Fennel Water : రక్తపోటు.. క్యాన్సర్ సమస్యలను తగ్గించే సోంపు నీరు.. బరువు తగ్గాలనుకునేవారికి సూపర్ పుడ్..

|

Jun 19, 2021 | 12:32 PM

సోంపు.. మనం ఎక్కువగా ఆహారం జీర్ణం కావడానికి మాత్రమే తీసుకుంటుంటాం. అలాగే.. మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తుంటాం.

Fennel Water : రక్తపోటు.. క్యాన్సర్ సమస్యలను తగ్గించే సోంపు నీరు.. బరువు తగ్గాలనుకునేవారికి సూపర్ పుడ్..
Fennel Water
Follow us on

సోంపు.. మనం ఎక్కువగా ఆహారం జీర్ణం కావడానికి మాత్రమే తీసుకుంటుంటాం. అలాగే.. మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తుంటాం. ఇందులో అనేక రకాల పోషకాలున్నాయి. మాంగనీస్, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కేవలం సోంపును నేరుగానే కాకుండా. సోంపు వాటర్ తీసుకోవడం కూడా చాలా బెటర్.

సోంపు నీరు ఎలా తయారు చేయాలి..
ముందుగా సోంపును రాత్రింతా నానబెట్టాలి. ఆ తర్వాత ఉదయాన్నే వాటిని తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. అలాగే సోంపు టీ కోసం.. మరుగుతున్న నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి వెంటనే దింపి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆ నీరు మొత్తం సోంపు రంగులోకి మారిన తర్వాత చల్లార్చి తాగాలి. రోజుకు 2, 3 సార్లు తాగాలి.

జీర్ణక్రియకు..
సోంపు తినడం.. సోంపు నీరు తాగడం వలన గ్యాస్ట్రిక్ ఎంజైమ్ ల ఉత్పత్తి పెంచుతుంది. అలాగే జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అలాగే మలబద్ధకం.. అజీర్ణం.. ఉబ్బరం వంటి వాటికి చికిత్స చేస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది..
పొటాషియం పుష్కలంగా ఉండే ఈ సోంపు శరీరానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా.. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

కంటి ఆరోగ్యానికి..
కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన కళ్లకు చాలా మంచిది.

కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది…
రోజు సోంపు వాటర్ తాగడం వలన కాళ్లలో వచ్చే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా.. మహిళలకు పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది.

క్యాన్సర్ నివారిణి..
కడుపు, చర్మం, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యల నుంచి సోంపు రక్షిస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్ వలన కలిగే నష్టం శరీరాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి..
రోజు సోంపు తీసుకోవడం వలన బరువు తగ్గేందుకు సహాయపడతాయి.

Also Read: Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..

Ayurveda-Turmiric Benefits: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు