Health News: పరగడుపున ఈ 5 ఆహారాలు అస్సలు తినవద్దు..! విషంతో సమానం..
Health News: కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
Health News: కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే కొన్ని పదార్థాలు పరగడుపున తింటే చాలా మంచిదంటారు పెద్దలు. ఎందుకంటే వాటి ప్రభావం అప్పుడే ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని మాత్రం పరగడుపున అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటివల్ల చాలా ప్రమాదం. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. 1.టమోటాలు టమోటాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ పచ్చి టమోటాలను పరగడుపున తినడం మంచిది కాదు. అందులో ఉండే సోర్ యాసిడ్ కడుపులో ఉన్న గ్యాస్ట్రోఇంటెస్టినల్ యాసిడ్‌తో కలిసి కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంటను పెంచుతుంది. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 2. స్వీట్స్ మీరు పరగడుపున కొన్ని తీపి పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో స్వీట్లు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రోజంతా అలసిపోయినట్లు ఉంటుంది. 3. మద్యం పరగడుపున మద్యం తాగడం మంచిది కాదు. అది మీకు విషం కంటే ఎక్కువ. ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల విపరీతమైన మత్తుకు దారితీస్తుంది. ఇది ప్రేగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 4. పాలు, అరటి బరువు తక్కువగా ఉన్నవారు అరటిపండు, పాలు మిక్స్ చేసి తింటారు. అయితే పరగడుపున ఇలా చేయడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉంటాయి. మీరు ఇలా చేసేముందు ఒక్కసారి వైదుడిని సంప్రదిస్తే బాగుంటుంది. 5.చిలగడదుంప తియ్యటి బంగాళాదుంపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వీటిని పరగడుపున తినకూడదు. అది మీకు హాని కలిగిస్తుంది. ఇందులో ఉండే టానిన్, పెక్టిన్ కారణంగా గ్యాస్ట్రిక్, యాసిడ్ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇది కాకుండా గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి.