Health Tips: ఇలాంటి వారు రాత్రి పూట పాలు తాగితే ప్రమాదం.. ఎందుకంటే?

|

Jun 28, 2022 | 9:50 PM

డయాబెటిక్ పేషెంట్స్ ఏ సమయంలో పాలు తాగాలో తప్పక తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే సాధారణ పాలకు బదులు ఈ మూడు పదార్థాలను పాలలో కలుపుకుని తాగితే రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Health Tips: ఇలాంటి వారు రాత్రి పూట పాలు తాగితే ప్రమాదం.. ఎందుకంటే?
Almond Milk
Follow us on

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచే అనేక అంశాలు ఉన్నాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి. ఏయే పదార్థాలు తినాలి, ఏయే పదార్థాలకు దూరంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది మధుమేహం ఉన్నప్పటికీ రాత్రిపూట పాలు తీసుకుంటారు. కానీ, డయాబెటిక్ పేషెంట్ రాత్రి పాలు తాగడం వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే పాలు ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ సమయంలో పాలు తాగాలి.. మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు అస్సలు తాగకూడదు. ఇలాంటి వారు పాలు తాగడానికి ఉదయం సరైన సమయం. అల్పాహారం సమయంలో పాలు తాగాలి. దీని కారణంగా, పాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారంగా పాలు తాగాలని సూచించడానికి కారణం కూడా ఇదే.

ఎలాంటి పాలు తాగాలి..

ఇవి కూడా చదవండి

1- బాదం పాలు- డయాబెటిస్‌‌తో బాధపుడుతున్నప్పడు బాదం పాలు తాగాలి. బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ డి, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బాదంపప్పును పాలలో కలిపి తాగాలి.

2- పసుపు పాలు- పసుపు పాలు అందరికీ ప్రయోజనకరం. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి డయాబెటిక్ రోగులకు మేలు చేస్తాయి. పసుపు పాలు తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయి బాగానే ఉంటుంది. అందుకే పసుపు పాలు తప్పనిసరిగా తాగాలి.

3- దాల్చిన చెక్క పాలు- మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క పాలు తాగాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని రుజువు చేస్తుంది. డయాబెటిస్‌లో దాల్చినచెక్క చాలా ప్రయోజనకరంగా పేరుగాంచింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.