AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Chutney Recipe: మీ బ్రేక్‌ఫాస్ట్ రుచిని అమాంతం పెంచే స్పైసీ కొత్తిమీర చట్నీ.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..

ఉదయం పూట వేడివేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోశలు తిన్నప్పుడు, వాటిలోకి సరైన చట్నీ ఉంటే ఆ మజానే వేరు. సాధారణంగా చేసే కొత్తిమీర చట్నీ కాకుండా, చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో చేసే ఈ చట్నీ మీ బ్రేక్‌ఫాస్ట్ రుచిని రెట్టింపు చేస్తుంది. ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండింటినీ వాడటం వల్ల వచ్చే ఘాటు, రుచి చట్నీకి కొత్త రూపాన్ని ఇస్తాయి.

Coriander Chutney Recipe: మీ బ్రేక్‌ఫాస్ట్ రుచిని అమాంతం పెంచే స్పైసీ కొత్తిమీర చట్నీ.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
Coriander And Shallots Chutney Recipe
Bhavani
|

Updated on: Jan 24, 2026 | 5:13 PM

Share

కొత్తిమీర చట్నీని అనేక పద్ధతుల్లో చేస్తారు, కానీ ఈ ‘చెట్టినాడు’ స్టైల్ చట్నీ చాలా ప్రత్యేకం. ఇందులో వాడే చిన్న ఉల్లిపాయలు చట్నీకి మంచి తీపిని, వెల్లుల్లి మంచి సువాసనను అందిస్తాయి. దీనిని తయారు చేయడం చాలా సులభం సమయం కూడా తక్కువే పడుతుంది. మీరు ఎప్పుడూ చేసే రొటీన్ చట్నీలకు బదులుగా, ఈసారి ఈ స్పెషల్ కొత్తిమీర-చిన్న ఉల్లిపాయ చట్నీని ఎలా చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు:

నూనె, మినప్పప్పు

ఎండు మిరపకాయలు (2),

పచ్చిమిర్చి (2)

చిన్న ఉల్లిపాయలు (15),

వెల్లుల్లి (8 రెబ్బలు)

చింతపండు (చిన్న ముక్క)

కొత్తిమీర (1 గుప్పెడు),

కొబ్బరి తురుము (1/2 కప్పు)

పోపు కోసం: ఆవాలు,

జీలకర్ర పొడి, కరివేపాకు

తయారు చేసే విధానం:

ముందుగా ఒక పాన్ లో నూనె వేసి, మినప్పప్పును దోరగా వేయించాలి. ఆపై ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి.

తర్వాత పచ్చిమిర్చి, చింతపండు వేసి కొద్దిసేపు వేయించి, శుభ్రం చేసుకున్న కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర కొద్దిగా వాడగానే స్టవ్ ఆఫ్ చేయాలి.

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడిపైనే కొబ్బరి తురుము వేసి కలిపి చల్లారనివ్వాలి.

చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, తగినంత ఉప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

చివరగా ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి జీలకర్ర పొడితో పోపు పెట్టుకుని చట్నీలో కలిపితే రుచికరమైన కొత్తిమీర చట్నీ సిద్ధం.

Follow Us
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
పోస్టాఫీసుల్లో అద్బుత స్కీమ్.. పెట్టుబడి డబుల్ గ్యారంటీ
పోస్టాఫీసుల్లో అద్బుత స్కీమ్.. పెట్టుబడి డబుల్ గ్యారంటీ
షారుక్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష
షారుక్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష
ట్యాన్‌ను దూరం చేసే ఇంట్లో తయారు చేసే ప్యాక్స్
ట్యాన్‌ను దూరం చేసే ఇంట్లో తయారు చేసే ప్యాక్స్
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు