Chakkara Pongal Recipe : పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఏదొక స్పెషల్ వంటకం ఉండల్సిందే.. నేడు శివరాత్రి.. నిజానికి ఈరోజు శివుడిని పూజిస్తూ.. ఉపవాసం, జాగారం చేయడం ఈరోజు ప్రత్యేకత.. అయితే ఇంట్లో చిన్నవాళ్లు, వృద్ధులు.. ఉంటె.. వారికోసం తప్పనిసరిగా స్పెషల్ వంటకాలు చేస్తారు. ఈరోజు తీపి పొంగలి లేదా చక్కర పొంగలి తయారీ విధానం తెలుసుకుందాం..!
కొత్త బియ్యం ఒక కప్పు
పెసరపప్పు అర కప్పు
పంచదార. (లేదా బెల్లంపొడి) అర కప్పు
చిక్కటి పాలు మూడు కప్పులు (లేదా కొంచెం పాలు, కొలతకు సరిపడిన నీరు) తీసుకోవచ్చు.
యాలకుల పొడి
ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా తరిగినవి అరకప్పు
నెయ్యి (కావల్సినంత )
జీడిపప్పు
బాదం
కిస్మిస్
పచ్చకర్పూరం చిటికెడు ఇది ఇష్టమైన వారు వేసుకోవచ్చు లేకున్నా ఒకే
ముందుగా బియ్యాన్ని పెసర పప్పును నాన బెట్టి ఓ అరగంట పాటు అలా ఉంచెయ్యాలి.. అనంతరం నీరు లేకుండా జల్లెడ వేసుకోవాలి.
ఇంతలో బాణలి పెట్టి.. నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదాం కిస్ మిస్ లను ఒకొక్కటిగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మరికొంచెం నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత బియ్యం, పెసర పప్పును దోరగా వేయించుకోవాలి. ఇంతలో మరో స్టౌ పై మందపాటి గిన్నె పెట్టుకుని పాలు పోసి మరగబెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించిన బియ్యం, పెసర పప్పుని వేసి గరిటతో తిప్పుతూ.. బాగా ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత పంచదార లేదా బెల్లం పొడి వేసి బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు, బాదాం , కిస్ మిస్ లను వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకుని మిగిలిన నెయ్యి వేసుకుని దింపేసుకోవాలి.. ఇష్టమైన వారు పచ్చకర్పూరం కొంచెం వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తినేవారు వేడిగా ఉన్నప్పుడే కొంచెం పంచదార వేసుకుని కలుపుకోవాలి.
Also Read: