Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?

Bananas: అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో ఆరోగ్యాన్ని అందించే వాటిగా వీటికి పేరు ఉంది. వైద్యులు సైతం కచ్చితంగా అరటి

Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?
Banans

Updated on: Feb 12, 2022 | 8:17 AM

Bananas: అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో ఆరోగ్యాన్ని అందించే వాటిగా వీటికి పేరు ఉంది. వైద్యులు సైతం కచ్చితంగా అరటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే అరటి పండ్లతో వచ్చే ప్రధాన సమస్య ఎంత తాజా అరటి పండ్లు తెచ్చినా రెండో రోజుకి అవి మచ్చలు వచ్చేస్తాయి. తరువాత నల్లబడతాయి. ఆ వెంటనే పాడైపోతాయి. ఇండియన్ ఫ్యామిలీ లో అరడజను పండ్లు తక్కువ, డజను పండు ఎక్కువ అయిపోతాయి. దీంతో చాలామంది అరటిపండ్లని కొనడానికి మొగ్గు చూపరు. అయితే అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఇతర పండ్లకి దూరంగా ఉంచాలి

అరటిపండ్లని ఇతర పండ్లకి దూరంగా ఉంచాలి. వీటి పక్కన అవకాడో, టొమాటో, యాపిల్స్, అత్తి పండ్లు ఉంటే తొందరగా పక్వానికి వస్తాయి. ఎందుకంటే ఈ పండ్లు ఇథలిన్ వాయువుని విడుదల చేస్తాయి. అరటిపండ్లని ప్రత్యేకంగా ఒక హ్యాంగర్‌కి వేలాడదీయాలి. డజనో అరడజనో అరటి పండ్లు తెచ్చినప్పుడు వెంటనే వాటిని విడగొట్టేయండి. విడివిడిగా ఉన్నప్పుడు అరటి పండ్లు త్వరగా పాడవవు. సిల్వర్ పేపర్‌లో అరటి పండు మొదలుని కవర్ చేసినా పండు పాడవదని కొంత మంది అంటారు.

అల్యూమినియం పేపర్‌లో చుట్టాలి

అరటిపండు అల్యూమినియం పేపర్‌లో చుడితే చాలా రోజులు తాజాగా ఉంటుంది. అరటిపండ్లు పండటానికి విడుదలయ్యే ఇథలిన్ వాయువు మొదటగా గుత్తి పైభాగంలో విడుదలవుతుంది. అల్యూమినియం పేపర్‌లో చుట్టడం వల్ల ఇథలిన్ వాయువు చాలా ఆలస్యంగా విడుదలవుతుంది. దీంతో చాలా రోజులు తాజాగా ఉంటుంది.

ఫ్రీజర్‌ పెట్టినా తొందరగా పండవు

మీరు అరటిపండ్లను చాలా రోజులు తాజాగా ఉంచాలంటే రిఫ్రిజిరేటర్‌కు బదులుగా ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే అరటిపండ్లు కనీసం 30 రోజులు తాజాగా ఉంటాయి. బేకరీలో తయారు చేసే బనానా చాక్లెట్, అరటిపండు పాన్‌కేక్‌లను ఇలాగే తయారు చేస్తారు.

బనానాలో చాలా ఎక్కువ కంటెంట్ లో పొటాషియం ఉంటుంది. ఇందువల్లే ఈ ఫ్రూట్ ని సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ మినరల్ కి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ ని అలెర్ట్ గా ఉంచుతుంది. మీ హార్ట్, బ్రెయిన్ హెల్దీగా ఉండాలంటే రోజుకి ఒక అరటి పండు తినడం అలవాటు చేసుకోండి.

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

Viral Photos: వర్షపు నీటితో మాత్రమే దాహం తీర్చుకునే ఏకైక పక్షి ఇదే.. భూమిపై ఉన్న నీరు అస్సలు ముట్టుకోదు..?

Liver Disease: ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.. జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు..?