Bottle Gourd: సమ్మర్‌లో సొరకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్..

|

Apr 23, 2022 | 1:01 PM

Benefits of Bottle Gourd: సొరకాయలో విటమిన్-సి, సోడియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయ చాలా మందికి బోరింగ్ వెజిటేబుల్‌గా కనిపిస్తుంది. కానీ..

Bottle Gourd: సమ్మర్‌లో సొరకాయతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్..
Bottle Gourd
Follow us on

Benefits of Bottle Gourd: సొరకాయలో విటమిన్-సి, సోడియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయ చాలా మందికి బోరింగ్ వెజిటేబుల్‌గా కనిపిస్తుంది. కానీ.. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. షాకవుతారు. సొరకాయ చల్లదనానన్ని కలిగించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కావున మీరు ప్రతి సీజన్‌లో వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రస్తుతం వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతోపాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మీరు సొరకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అది కూడా చాలా మార్గాలలో సొరకాయను వండుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సొరకాయ రెసెపీలు..

  • సొరకాయ కేకులు
  • సొరకాయ రైతా
  • సొరకాయ ప్లెయిన్ వెజిటబుల్
  • సొరకాయ గోర్డ్ వెజిటబుల్
  • సొరకాయ, సెనగలు మిక్స్‌డ్ వెజిటబుల్ రూపంలో తినవచ్చు..

వేసవిలో సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇది వేడిని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది.
  • సొరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • సొరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషధం లాంటిది. ఇది చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • సొరకాయ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ మొదలైన సమస్యలు దూరమవుతాయి.
  • దీనిని తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆహారం పూర్తిగా శరీరానికి అందుతుంది.
  • ఆనపకాయలో ఐరన్ చాలా మంచి మొత్తంలో ఉంటుంది. కావున ఇది శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడానికి తోడ్పడుతుంది.
  • సొరకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.
  • కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు సహజంగా లభిస్తాయి. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది
  • లూజ్ మోషన్‌ లాంటి సమస్యతో బాధపడుతుంటే.. పెరుగు లేదా మజ్జిగతో పొట్లకాయ రైతా తింటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. నీరసం కూడా తగ్గుతుంది.

వేసవిలో లాభాలు..

  • వేడి, మైకము నుంచి ఉపశమనం లభిస్తుంది.
  •  శరీరంలో నీరు లేకపోవడాన్ని నియంత్రిస్తుంది.
  • వడ దెబ్బ తగలకుండా చేసుంది.
  • లూజ్ మోషన్ సమస్యను నివారిస్తుంది.
  • వేడి కారణంగా శ్వాస ఆడకపోవడం, అలసట ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఎండ, ధూళి, చెమట, అధిక వేడి కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చినా రోజూ తీసుకునే ఆహారంలో సొరకాయను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు. సొరకాయతో చేసిన ఏదైనా ఒక వంటకాన్ని రోజుకు ఒక్కసారైనా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

(ఈ కథనం.. కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 దీనిని దృవీకరించడం లేదు. పాటించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Curd: పెరుగు తింటే అసలు తిరుగుండదు.. కానీ వీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి

Diabetes Control: నేరేడు గింజలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.. పొడిని ఇలా తయారు చేసుకోండి..