మెరిసే చర్మం కోసం గ్రీన్‌ టీని మించినది లేదు..! ఈ 4 విషయాలు తెలిస్తే నిజమే అంటారు..

|

Nov 30, 2021 | 10:19 PM

Green Tea: గ్రీన్‌ టీ ఒక క్లాసిక్‌ టీ. చాలా ఏళ్లుగా ప్రజలు దీనిని తాగుతున్నారు. ఇది ఒక సహజసిద్దమైన మూలికా టీ అని చెప్పవచ్చు. ఎన్నో రకాల టీలు ఉన్నాయి కానీ గ్రీన్‌ టీకి

మెరిసే చర్మం కోసం గ్రీన్‌ టీని మించినది లేదు..! ఈ 4 విషయాలు తెలిస్తే నిజమే అంటారు..
Green Tea 1
Follow us on

Green Tea: గ్రీన్‌ టీ ఒక క్లాసిక్‌ టీ. చాలా ఏళ్లుగా ప్రజలు దీనిని తాగుతున్నారు. ఇది ఒక సహజసిద్దమైన మూలికా టీ అని చెప్పవచ్చు. ఎన్నో రకాల టీలు ఉన్నాయి కానీ గ్రీన్‌ టీకి ఉండే ప్రత్యేకత వేరు. గ్రీన్‌ టీని కామెల్లియా సైనెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. మెదడు అభివృద్ధిని మెరుగుపరచడం నుంచి బరువు తగ్గించడం వరకు గ్రీన్ టీ వివిధ ప్రయోజనాలను కలిగి ఉంది. మీరు మీ చర్మం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే చింతించకండి. మీ ముఖ తేజస్సుకు కూడా గ్రీన్‌ టీ ఉపయోగపడుతుంది. ఎలాగో తెలుసుకుందాం.

1. చర్మ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది
ఈ టీలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. క్యాన్సర్‌ రాకుండా కాపాడుతాయి.

2. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి
యవ్వనంగా కనిపించాలని చాలామంది అనుకుంటారు కానీ కుదరదు. మీరు ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. ఇది నిజం. చాలా అధ్యయనాల ద్వారా ఇది నిరూపణ అయింది. ఇందులోని EGCG మీ చర్మ కణాలను రక్షిస్తుంది. ఈ పానీయం తాగడం ద్వారా మీకు విటమిన్ బి-2 లభిస్తుంది. ఇది మీ కొల్లాజెన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

3. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి
తమ చర్మంపై కోతలు, వాపులను తగ్గించడానికి గ్రీన్ టీని ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. సోరియాసిస్ లేదా రోసేసియా వంటి చర్మ సమస్యల చికిత్సలో గ్రీన్‌ టీని తాగమని సలహా ఇస్తారు.

4. మొటిమలకు గొప్ప ఔషధం
జిడ్డు చర్మం లేదా మొటిమలు ఉన్నవారు ప్రతిరోజు గ్రీన్‌ టీ తాగాలి. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలకు మొటిమలను తగ్గించే గుణం ఉంటుంది. మీరు మొటిమల వ్యాప్తిని నిరోధించడానికి, ఆరోగ్యకరమైన చర్మం కోసం గ్రీన్‌ టీ తాగాలి. బరువు తగ్గించడం, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా గ్రీన్ టీలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది మీ ముఖాన్ని హైడ్రేట్ చేస్తుంది మీ చర్మానికి పోషణనిస్తుంది.

ముఖం ముడతలు పడుతుందని ఇబ్బందిపడుతున్నారా..! ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిస్తే అందం మీ సొంతం..

10 మ్యాచ్‌లో 43 వికెట్లు తీసిన ఈ బౌలర్‌ టీమిండియాకి సవాల్‌ విసిరాడు..! ఏ విషయంలో తెలుసా..?

పెంపుడు జంతువులు కరిస్తే అజాగ్రత్తగా ఉండకండి.. చాలా ప్రమాదం ఈ విషయాలు తెలుసుకోండి..