Java Plum : నేరేడు పండ్లతో జాగ్రత్త..! ఎక్కువగా తింటే ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు..? ఏంటో తెలుసుకోండి..
Java Plum Side Effects : నేరేడు పండ్లను చూస్తే చాలు నోటిలో నీరు ఊరడం మొదలవుతుంది. ముఖ్యంగా కొంతమంది
Java Plum Side Effects : నేరేడు పండ్లను చూస్తే చాలు నోటిలో నీరు ఊరడం మొదలవుతుంది. ముఖ్యంగా కొంతమంది జబ్బుపడినవారికి ఈ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి లేదా క్యాన్సర్ వ్యాధి నివారణకు చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు చేసిన పరిశోధనలలో ఈ విషయం ఎప్పుడో బయటపడింది. ఔషధ లక్షణాల ఆధారంగా దీనిని ఆయుర్వేదం, హోమియోపతిలలో కూడా ఉపయోగిస్తున్నారు. కానీ అధిక వినియోగం వల్ల చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండు తినేటప్పుడు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి (1) నేరేడు పండు తీసుకోవడం వల్ల సహజంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కనుక శస్త్రచికిత్సకు ముందు లేదా వీటిని తినడం మానుకోవాలి. (2) గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా నేరేడు తినకూడదు. (3) నేరేడు పుల్లని రుచి కారణంగా ఖాళీ కడుపుతో లేదా పాలు త్రాగిన తరువాత తినకూడదు. ఎందుకంటే ఇది ఆమ్లతను కలిగిస్తుంది. (4) నేరేడు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. (5) ఎగ్జాస్ట్ పొగ నుంచి భారీ లోహాలతో కలుషితం కావడం వల్ల రోడ్డు పక్కన ఉండే చెట్ల నుంచి వచ్చిన నేరేడు పండ్లను తినడం మానుకోండి. (6) నేరేడు పెద్ద మొత్తంలో తినడం వల్ల జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్య వస్తుంది. (7) నేరేడు శరీరంలో వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. అధిక స్థాయిలో వాతం ఉన్నవారు ఈ పండు తినకుండా ఉండటమే మేలు. (8) నేరేడు పండ్లను అథెరోస్క్లెరోసిస్ లేదా రక్తం గడ్డకట్టే చరిత్ర ఉన్నవారు వీటిని తీసుకోకూడదు. (9) నేరేడు అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం, గ్యాస్ ఏర్పడతాయి. (10) వాంతి చేసే ధోరణి ఉన్నవారు నేరేడు తినకూడదు.
Read Also: Komaki Electric Scooter : ఈ కంపెనీ స్కూటర్‌పై రూ.20,000 తగ్గింపు..! అవకాశం కొన్నిరోజులు మాత్రమే..
Viral Video: ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!