అవోకాడో.. అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. అవోకాడో రక్తపోటును తగ్గించడంలో, బరువు తగ్గడంలో మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సలాడ్లు, టోస్ట్, స్మూతీస్ వంటి వివిధ వంటకాలకు అవోకాడోను వినియోగిస్తారు. అయితే అవోకాడో బరువు తగ్గడంలో సహాయపడుతుందా? ఇది ఎంతవరకు నిజమో ఇక్కడ తెలుసుకుందాం.. అవకాడో వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో చూద్దాం.
బరువు పెరగడం: అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకమైనది. పైగా రుచికరమైనది.ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
న్యూట్రీషియన్ రిచ్: అవకాడోస్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో గుండె ఆరోగ్యానికి సహాయపడే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అవకాడోలో పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫోలేట్, మినరల్స్ ఉంటాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యం: చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో అవకాడో గ్రేట్ గా సహాయపడుతుంది. అవకాడోలో ఫోలేట్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్, జుట్టుకు అవసరం. చర్మం స్థితిస్థాపకతకు విటమిన్ ఇ ముఖ్యమైనది.
ఫైబర్ పుష్కలంగా ఉంటుంది: ఉదయం పూట అవకాడో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.ఇది అతిగా తినడం నిరోధించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: అవకాడోలో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల డైటింగ్ చేసేవారికి ఇది మంచిది.
కంటి ఆరోగ్యం: అవకాడోలో లుటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటిశుక్లం, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది వయస్సు సంబంధిత దృష్టి సమస్యల నుండి రక్షిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..