పేదవారి బాదం వేరుశెనగ.. డయాబెటిస్ రోగులు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా..

వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.. వాస్తవానికి.. ఇంట్లో ఖాళీగా ఉన్నా.. బోర్ కొడుతున్నా.. టీవీ చూస్తున్నా.. లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు.. మనం వేరుశెనగలు తినడానికి ఇష్టపడతాము.. అయితే ఈ సూపర్‌ఫుడ్ డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందా..? హాని చేస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

పేదవారి బాదం వేరుశెనగ.. డయాబెటిస్ రోగులు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా..
Peanuts

Updated on: Dec 09, 2024 | 6:47 PM

మధుమేహం కేసులు పెరుగుతున్నాయి.. లక్షలాది మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు.. ఒకప్పుడు వృద్ధులలో కనిపించే ఈ వ్యాధి .. చిన్న వయస్సు వారిని కూడా వదిలిపెట్టడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడు ఏం తినాలి.. ఏమి తినకూడదు అనే సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగినా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. మధుమేహంలో కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు, కంటిచూపు బలహీనపడే ప్రమాదం ఉంది. కొంతమందికి ఈ సంక్లిష్ట వ్యాధి సమయంలో వేరుశెనగలు తినవచ్చా లేదా..? తింటే ఏమవుతుంది… అనే ప్రశ్న తలెత్తుతుంది..

వేరుశనగల్లో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.. వాస్తవానికి.. ఇంట్లో ఖాళీగా ఉన్నా.. బోర్ కొడుతున్నా.. టీవీ చూస్తున్నా.. లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు.. మనం వేరుశెనగలు తినడానికి ఇష్టపడతాము.. అయితే ఈ సూపర్‌ఫుడ్ డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందా..? హాని చేస్తుందా..? డయాబెటిస్ రోగులు వెరుశనగలు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకోండి..

వేరుశెనగలో లభించే పోషకాలు: వేరుశెనగలను సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు.. అందుకే వేరుశెనగ చాలా పోషకమైన ఆహారాల జాబితాలో చేర్చారు.. దీనిని తినడం ద్వారా శరీరానికి సమృద్ధిగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B కాంప్లెక్స్, పాంతోతేనిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ తినవచ్చా లేదా?..

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే వేరుశెనగ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అదనంగా, మెగ్నీషియం వేరుశెనగలో ఉంటుంది.. ఇది డయాబెటిస్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు, డయాబెటిక్ రోగులకు ముఖ్యమైన వేరుశెనగ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూడండి..

వేరుశెనగ తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..

కొలెస్ట్రాల్ తగ్గుతుంది: వేరుశెనగ తినడం వల్ల మన సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్, మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి, వారు తప్పనిసరిగా వేరుశెనగ తినాలి.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది: వేరుశెనగలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అందుకే.. వేరుశెనగను ‘పేదవారి బాదం’ అని కూడా పిలుస్తారు.. ఇది తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది.

బరువు తగ్గుతుంది లేదా బరువు నియంత్రణలో ఉంటుంది: డయాబెటిక్ పేషెంట్లకు స్థూలకాయం తక్కువ కాదు.. అటువంటి పరిస్థితిలో వేరుశెనగ తింటే, అది చాలా కాలం పాటు వారి కడుపు నిండుగా ఉంటుంది.. ఇది వారు అతిగ ఆహారం తినడం నుంచి కాపాడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి