Apple Skin or Skinless: ఆపిల్ తొక్క తీసేసి తింటే ప్రయోజనమా? నేరుగా తింటే ప్రయోజనమా?.. ఆసక్తికర వివరాలు మీకోసం..

|

Jun 07, 2022 | 6:12 PM

Apple Skin or Skinless: రోజూ ఒక ఆపిల్ పండు తింటే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. ఆపిల్ ఆరోగ్యం పరంగా అనేక ప్రయోజనాలు

Apple Skin or Skinless: ఆపిల్ తొక్క తీసేసి తింటే ప్రయోజనమా? నేరుగా తింటే ప్రయోజనమా?.. ఆసక్తికర వివరాలు మీకోసం..
Apple Peeloff
Follow us on

Apple Skin or Skinless: రోజూ ఒక ఆపిల్ పండు తింటే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. ఆపిల్ ఆరోగ్యం పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆపిల్ తినే విధానంపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆ కారణంగా ఆపిల్‌ను ఎలా తినాలో తెలియక చాలా మంది కన్‌ఫ్యూజన్‌తోనే తినేస్తుంటారు. ముఖ్యంగా ఆపిల్‌ను తొక్క తీసి తినాలా? లేక అలాగే తినాలా? తొక్క తీసి తింటే రుచి పోతుందని కొందరు.. తొక్క అలాగే ఉంచి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఇంకొందరు తమలో తామే ఒక నిర్ణయానికి వస్తారు. అయితే, ఆపిల్‌ను ఎలా తిన్నా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అలాగే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ గుజ్జుల్లో ఫైబర్, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో ఆపిల్ తొక్కలోనూ అద్భుతమైన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. ఆపిల్ తొక్క కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఊపిరితిత్తులను రక్షిస్తుంది:

ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన గుండె:

యాపిల్ స్కిన్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన గుండె కోసం వాస్కులర్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి.

బరువు తగ్గడంలో సహాయం:

ఆపిల్ తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అతిగా తినకుండా నిరోధించడానికి తోడ్పడుతుంది. సరైన స్థాయిలో వ్యాయామం చేస్తూ.. రోజుకు సరిపడగా కేలరీల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే పాలీఫెనాల్స్ బరువు తగ్గడానికి కొవ్వు, గ్లూకోజ్ శోషణను నిరోధిస్తాయి.

ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ:

ఆపిల్‌ స్కిన్‌లో బరువు తగ్గించే లక్షణాలతో పాటు.. కాలేయ పనితీరు మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ రోగులు, మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరంతో సతమతం అవుతున్న వారికి ఈ ఆపిల్ స్కిన్ అద్భుత ఔషధంగా పని చేస్తుంది.

విటమిన్లు పుష్కలం:

ఆపిల్ స్కిన్‌లో విటమిన్లు ఏ, కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, భాస్వరం కూడా ఉన్నాయి. ఇవి మూత్రపిండాలు, గుండె, మెదడు, చర్మం, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

గమనిక: ఇందులో సమాచారం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఆపిల్ స్కిన్ తినే విషయంలో వైద్య సలహాలు, సూచనలు పాటించడం చాలా ముఖ్యం.