AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura Chicken: అబ్బబ్బా.. గోంగూర చికెన్ కర్రీ.. ఈ విషయం తెలిస్తే తపాలా మొత్తం లాగించేస్తారు..

నాన్‌వెజ్ ప్రియులు చికెన్ .. అనగానే లొట్టలేసుకుంటూ మరి తింటారు.. చికెన్ ను ఫ్రై, కూర.. ఇలా పలు విధాలుగా వండుకుని ఇష్టంగా లాగించేస్తారు.. వీటిలోని ప్రోటీన్.. పోషకాలు శరీరానికి చాలా మంచిది.. అయితే.. ఎప్పుడైనా గోంగూర చికెన్ ను ట్రై చేశారా..?

Gongura Chicken: అబ్బబ్బా.. గోంగూర చికెన్ కర్రీ.. ఈ విషయం తెలిస్తే తపాలా మొత్తం లాగించేస్తారు..
Gongura Chicken Curry
Shaik Madar Saheb
|

Updated on: Feb 17, 2026 | 3:59 PM

Share

నాన్‌వెజ్ ప్రియులు చికెన్ .. అనగానే లొట్టలేసుకుంటూ మరి తింటారు.. చికెన్ ను ఫ్రై, కూర.. ఇలా పలు విధాలుగా వండుకుని ఇష్టంగా లాగించేస్తారు.. వీటిలోని ప్రోటీన్.. పోషకాలు శరీరానికి చాలా మంచిది.. అయితే.. ఎప్పుడైనా గోంగూర చికెన్ ను ట్రై చేశారా..? సాధ్యమైనంత వరకు చాలా మంది ఈ కాంబినేషన్ ట్రై చేయరు.. కొంత మంది మాత్రమే.. రుచిగా వండుకుని ఆస్వాదిస్తూ తింటారు.. వాస్తవానికి గోంగూర చికెన్ కర్రీ లేదా ఫ్రై రుచిగా అద్భుతంగా ఉంటుంది. పోషకాలు కూడా చాలానే ఉంటాయి.. చికెన్ గోంగూర ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు (A, B6, C), యాంటీఆక్సిడెంట్లతో నిండిన పౌష్టికాహారం. గోంగూరలోని పులుపు జీర్ణక్రియకు, ఫైబర్ రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడగా, చికెన్ కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది. ఇది తక్కువ కేలరీలతో మంచి శక్తిని ఇస్తుందని డైటీషియన్లు పేర్కొంటున్నారు.

చికెన్ గోంగూర కర్రీ విధానం తెలుసుకోండి..

గోంగూర చికెన్ వంటకాన్ని సులభంగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు.. ఈ స్పెషల్ నాన్‌వెజ్ వంటకం అన్నం, చపాతీ లేదా బిర్యానీ కాంబినేషన్లకు అద్భుతమైన ఎంపిక..

ఈ స్పెషల్ నాన్ వెజ్ వంటకానికి ముందుగా చికెన్, గోంగూర తీసుకోని మంచిగా శుభ్రం చేసుకోవాలి..

ఇవి కూడా చదవండి

ముందుగా, 100 గ్రాముల గోంగూర ఆకులను (కాడలు లేకుండా) ఒక టేబుల్ స్పూన్ నూనెలో మెత్తగా మగ్గించుకుని, మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత, అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి, ఒక బిర్యానీ ఆకు, అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, రెండు యాలక్కాయలు వేసి వేయించాలి. సన్నగా తరిగిన ముప్పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక టీస్పూన్ జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించాలి. అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత, ఒక పెద్ద టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు వేసి టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి.

శుభ్రం చేసుకున్న అర కిలో చికెన్ ముక్కలను (చిన్న సైజువి) వేసి 5-10 నిమిషాలు సగం ఉడికే వరకు మగ్గించాలి. తరువాత ఒకటిన్నర టీస్పూన్ కారం వేసి చికెన్ పూర్తిగా ఉడికే వరకు తక్కువ నుండి మీడియం మంటపై ఉడికించాలి. చివరిగా, మాష్ చేసుకున్న గోంగూర పేస్ట్, ఒక టీస్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. తక్కువ మంటపై ఐదు నిమిషాలు ఉడికించి, నూనె పైకి తేలిన తర్వాత అర కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోవాలి.

సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఒక టేబుల్ స్పూన్ వేసి రెండు నిమిషాలు మగ్గించాలి. చివరగా, ఒక టీస్పూన్ గరం మసాలా పొడి వేసి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో తయారుచేసిన గోంగూర చికెన్ చాలా రుచికరంగా ఉంటుంది.

మీకు కావాలంటే.. ఇలానే ఫ్రై కూడా చేసుకోవచ్చు.. కానీ.. దానిలో టమాటాలు, నీళ్లు అవసరం లేదు.. ఇంకా చికెన్ కొలతలను బట్టి గోంగూరతోపాటు.. తయారీలో మార్పులు చేసుకోవాలి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us