AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోటకూర తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

చాలా మంది తోటకూరను లైట్ తీసుకుంటారు. కానీ ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఇది కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు.. అద్భుతమైన పోషకాల నిధి. నిత్యం మనల్ని వేధించే రక్తహీనత, బలహీనమైన ఎముకలు, జీర్ణక్రియ సమస్యలకు తోటకూరతో చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అసలు తోటకూరను క్రమం తప్పకుండా తింటే శరీరంలో జరిగే ఆ అద్భుత మార్పుల గురించి తెలుసుకుందాం..

తోటకూర తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Amaranth Leaves Health Benefits
Krishna S
|

Updated on: Jul 12, 2026 | 1:34 PM

Share

ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన వంటింట్లో రెగ్యులర్‌గా కనిపించే ఆకుకూరల్లో తోటకూర అత్యంత శక్తివంతమైన పోషకాల నిధి అని నిపుణులు చెబుతున్నారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ తోటకూరను క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద ఆఫీసర్ డాక్టర్ వందనా తివారీ తెలిపారు.

రక్తహీనతకు చెక్

తోటకూరలో విటమిన్ ఎ, బి, సి లతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు తోటకూరను తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి, నీరసం, అలసట తగ్గుతాయి.

ఉక్కులాంటి ఎముకలు, దంతాలు

వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గి, కీళ్ల నొప్పులు రావడం సహజం. అయితే తోటకూరలో ఉండే అధిక కాల్షియం ఎముకలను, దంతాలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి తోటకూర ఒక వరం లాంటిది. ఇందులో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది సులభంగా జీర్ణమవడమే కాకుండా, ఆరోగ్యకరమైన ప్రేగుల కదలికలకు సహాయపడుతుంది.

కంటి చూపు మెరుగవుతుంది

మారుతున్న నేటి డిజిటల్ జీవనశైలిలో కంటి సంరక్షణ చాలా ముఖ్యం. తోటకూరలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి కంటి చూపును కాపాడటంలో, వివిధ రకాల కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడతాయి.

బరువు నియంత్రణ

బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర ఆకులు ఒక బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ వల్ల ఇది తిన్న తర్వాత కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా పదే పదే ఆకలి వేయడం తగ్గి, బరువు సులభంగా అదుపులోకి వస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ – గుండెకు రక్షణ

తోటకూరలో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు లేదా డయాబెటిస్ ఉన్నవారు దీనిని సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ఎంతో ప్రయోజనకరం.

మెరిసే చర్మం.. దృఢమైన జుట్టు

ఈ ఆకుకూరలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది చర్మానికి సహజమైన కాంతిని ఇవ్వడమే కాకుండా కేశ కుదుళ్లకు అవసరమైన పోషణను అందించి జుట్టును బలంగా మారుస్తుంది. అలాగే ఇందులోని విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

(గమనిక: తోటకూర పోషకాల నిధి అయినప్పటికీ, దీనిని ఎల్లప్పుడూ మితంగా మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీకు ముందే ఏదైనా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, దీనిని మీ డైట్‌లో చేర్చుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. )

Follow Us
పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!
పిల్లలు ఎగిరి గంతేసే వార్త.. మళ్లీ తెరుచుకోనున్న డిస్నీల్యాండ్‌!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రిక్షా తొక్కేవాడి కొడుకని గెంటారు.. సరిగ్గా పదేళ్లకి IAS అయ్యాడు!
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
29 ఏళ్ల వయసు చిన్నదైన భార్య.. ఈ తోపు విలన్ ప్రేమ కథ తెలిస్తే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
తోబుట్టువులకు ఈ గిఫ్ట్స్ ఇస్తే సర్‌ప్రైజ్ ఖాయం.. బడ్జెట్‌లోనే..
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. రూ.1.50లక్షల వరకు సబ్సిడీ
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
సౌభాగ్య యోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
గర్భిణీలను చూస్తే పాములకు కళ్లు కనిపించవా?అసలు కథ ఇదే
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
భారత్‌పై వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక యువ బ్యాటర్
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే
GATE 2027 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు ఇవే