AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Achari Chana Pulao: వర్షాకాలంలో స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలి ఉందా.. ఊరగాయ శనగల పులావ్ ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..

వర్షాకాలం వచ్చిదంటే చాలు కారం కారం ఏదైనా వంటకం తినాలని అనిపిస్తుంది. మీరు కూడా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే ఆచారి చనా పులావ్ ఒక గొప్ప ఎంపిక. ఆచారి చనా పులావ్ అంటే ఊరగాయ రుచితో ఉండి శనగలతో చేసిన పులావ్. దీనిని తయారు చేయడం సులభం. అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. మీరు దీన్ని రైతా లేదా గ్రీన్ చట్నీతో అందిస్తే పిల్లులు పెద్దలు అనే తేడా లేకుండా లొట్టలేస్తూ తినేస్తారు.

Achari Chana Pulao: వర్షాకాలంలో స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలి ఉందా.. ఊరగాయ శనగల పులావ్ ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..
Achari Chana Pulao
Surya Kala
|

Updated on: Jun 30, 2025 | 1:11 PM

Share

భారతీయులు భోజన ప్రియులు.. రాకరాకల సంస్కృతి, రకరకాల సంప్రదాయం.. భిన్నమైన ఆహారపు అలవాట్లు.. దీంతో ఆహార పదార్థాలకు కొరత లేదు. ఏ సీజన్ కు తగ్గట్టుగా రకాల వంటకాలు ఇక్కడ మీకు దొరుకుతాయి, ఇవి ఆహార రుచిని రెట్టింపు చేయమే కాదు.. ఆరోగ్యంగా కూడా ఉండేలా చేస్తాయి. దేశ వ్యాప్తంగా రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు పడుతున్నాయి. ఇలా వర్షం పడినప్పుడు.. వేడి వేడి ఏదైనా తినాలని కోరుకుంటారు. దాదాపు ప్రతి ఇంట్లో టీ, పకోడీలు తయారు చేస్తారు.

అయితే వర్షం పడుతుంటే నచ్చిన ఫుడ్ తినడం వలన కలిగే ఆనందాన్ని రెట్టింపు చేసే ఉల్లిపాయ పకోడీలు కాకుండా ఇంకా ఏమైనా ట్రై చేయొచ్చా అని ఆలోచిస్తుంటే.. ఈ రోజు మంచి బిర్యానీ రెసిపీ గురించి తెలుసుకుందాం.. అవును, ఈ రోజు ఆచారి శనగల పులావ్ తయారీ విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

బాస్మతి బియ్యం- 1/3 కప్పు

శనగపప్పు- అర కప్పు

మామిడికాయ పచ్చ (ఆవకాయ)- రెండు స్పూన్లు

టమోటా- 1 సన్నగా తరిగిన ఒక

నచ్చిన కూరగాయ ముక్కలు – కొన్ని

ఉల్లిపాయ- 1 సన్నగా తరిగినది

అల్లం పేస్ట్- ఒక టేబుల్ స్పూన్

వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్

సోంపు- అర టీస్పూన్

ఆవాలు- అర టీస్పూన్

మెంతులు- అర టీస్పూన్

కలోంజీ- అర టీస్పూన్

యాలకులు- రెండు నుండి మూడు

పసుపు- అర టీస్పూన్

గరం మసాలా పొడి- అర టీస్పూన్

జీలకర్ర-అర టీస్పూన్

ఇంగువ- చిటికెడు

కారం- అర టీస్పూన్

నెయ్యి- అవసరానికి సరిపడా

ఉప్పు- రుచికి

కొత్తిమీర- కొంచెం

తయారీ విధానం: ఊరగాయ శనగల పులావ్ చేయడానికి (ఆచారి చనా పులావ్) ఒక రోజు ముందు కాబూలి శనగలు నానబెట్టుకోవాలి.

పులావ్ చేసుకోవడానికి ముందు బాస్మతి బియ్యాన్ని 90 శాతం ఉడికించాలి.

మరోవైపు నానబెట్టిన కాబూలి శనగలను ఉడకబెట్టుకోవాలి.

ఈ రెండూ పూర్తయిన తర్వాత.. మీడియం మంట మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి.

దీని తరువాత, జీలకర్రతో పాటు తీసుకున్న మసాలా దినుసులు వేసి.. వాటిని వేయించాలి.

దీని తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి లేత గులాబీ రంగు వచ్చేవరకు వేయించాలి.

ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

దీని తరువాత తరిగిన టమోటాలు వేసి ఐదు నిమిషాలు ఉడికించి.. తర్వాత ఈ మిశ్రమంలో తీసుకున్న కూరగాయ ముక్కలను జోడించండి. ఇవి మెత్తబడే వరకు ఉడికించాలి.

దీని తర్వాత ఊరగాయలు, పసుపు, కారం, కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి.

దీని తరువాత, ఉడికించుకున్న శనగలు, ఉడికిన బియ్యం వేసి కొంచెం సేపు వేయించండి.

తర్వాత ఈ మిశ్రమంలో ఒక కప్పు నీళ్లు పోసి తక్కువ మంట మీద ఉదికిచండి.

బియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆర్పి ఐదు నిమిషాల వరకూ మూత తీయకుండా అలగే ఉంచండి. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అలంకరించండి. కావాలనుకున్న వారు కొంచెం నిమ్మరసం కూడా జోడించవచ్చు.

అంతే తక్కువ సమయంలోనే టేస్టీ టేస్టీ ఊరగాయ శనగల పులావ్ రెడీ. దీనిని వేడి వేడిగా రైతా లేదా గ్రీన్ చట్నీతో వడ్డించండి.