Potato Juice Benefits: బంగాళదుంప రసం తాగితే ఆ సమస్యలు ఇక మటుమాయమే.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Potato Juice Benefits: అత్యధిక పోషకాలున్న కూరగాయాల్లో బంగాళదుంప ఒకటి. దీనిలో అనేక రకాల పోషకాలున్నాయి. ఈ దుంపను ఆహారంగా

Potato Juice Benefits: బంగాళదుంప రసం తాగితే ఆ సమస్యలు ఇక మటుమాయమే.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..
Potato Juice Benefits

Updated on: Nov 09, 2021 | 1:05 PM

Potato Juice Benefits: అత్యధిక పోషకాలున్న కూరగాయాల్లో బంగాళదుంప ఒకటి. దీనిలో అనేక రకాల పోషకాలున్నాయి. ఈ దుంపను ఆహారంగా తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆలుగడ్డలతో పలు ఆహార పదార్థాలను తయారు చేసుకొని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. ఈ బంగాళదుంప రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ బి మరియు సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతేకాకుండా బంగాళాదుంప జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇప్పటుడు ఆలుగడ్డ రసం ఆరోగ్య ప్రయోజనాలతోపాటు.. ఇంట్లో బంగాళాదుంప రసాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగాళదుంప రసం ఎలా తయారు చేయాలంటే..?
నాలుగు బంగాళాదుంపలను తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని జ్యూసర్‌లో వేసి రసం తీయాలి. దీనిలో ఏం కలపకుండా తాగడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆలుగడ్డ ఆరోగ్య ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది: బంగాళదుంల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బంగాళాదుంప రసం తాగడం మంచిది.

కీళ్ల నొప్పులను నివారిస్తుంది: బంగాళాదుంప రసంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్, ఇతర కీళ్ల సంబంధిత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కల్పించడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నొప్పి ఉన్న ప్రదేశంలో బంగాళాదుంప ముక్కలతో మసాజ్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

అల్సర్లను దూరం చేస్తుంది: బంగాళాదుంప రసం జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళాదుంప రసాన్ని రోజూ ఉదయం తీసుకోవడం వల్ల అల్సర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

కాలేయాన్ని డిటాక్స్ చేస్తుంది: ఆలుగడ్డ రసం కాలేయం, పిత్తాశయాన్ని శుభ్రపరిచే డిటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది. అధ్యయనం ప్రకారం.. హెపటైటిస్ చికిత్సకు జపాన్‌లో బంగాళాదుంప రసాన్ని కూడా ఉపయోగిస్తారు.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: బంగాళదుంప రసంలో ఫైబర్, విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్, సి విటమిన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు.. శరీరాన్ని శక్తివంతంగా మార్చడంలో సహాయపడతాయి.

మలబద్ధకాన్ని దూరం చేస్తుంది: ఆలుగడ్డల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి.. మలబద్ధకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: బంగాళదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రణలో ఉంటుంది. ఆలుగడ్డల్లో గ్లైకోఅల్కలాయిడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ-ట్యూమర్ లక్షణాలను కలిగి ఉండి.. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also Read:

Health Tips: తిమ్మిర్లు వస్తున్నాయా..? అయితే ఆ సమస్యలున్నట్లే.. వెంటనే వైద్యుడిని కలవండి.. లేకుంటే..

Yoga Poses: కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ యోగాసనాలను ప్రయత్నించండి..