Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?

|

Nov 13, 2021 | 5:53 PM

Health Tips: ఎక్కువ కాలం జీవించాలంటే అది మీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలా పరిశోధనలలో కూడా ఇదే తేలింది. కానీ ఇప్పుడున్న ఆధునిక ఆహార

Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?
Five Foods
Follow us on

Health Tips: ఎక్కువ కాలం జీవించాలంటే అది మీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. చాలా పరిశోధనలలో కూడా ఇదే తేలింది. కానీ ఇప్పుడున్న ఆధునిక ఆహార శైలి చిన్నాభిన్నంగా మారింది. సమయ పాలన లేని తిండి, అంతేకాక ఆయిల్ ఫుడ్స్‌, కొవ్వు పదార్థాలు తినడం వల్ల రోజు రోజుకి ఆయువు క్షీణిస్తుంది. అయితే కొంతమంది ఆహార నిపుణులు100 ఏళ్లు బతకాలంటే కచ్చితంగా ఈ ఐదు ఆహారాలను తినాలని చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. తేనె
పచ్చి తేనెలో ఉండే సహజ పదార్థాలు గుండె జబ్బులతో పాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. తేనె కణితి లేదా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదర సమస్యలని తగ్గిస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సహజ నివారణిగా పనిచేస్తుంది.

2. మేక కేఫీర్‌
ప్రతి సంవత్సరం క్యాన్సర్ వల్ల చాలామంది చనిపోతున్నారు. పులియబెట్టిన మేక కేఫీర్‌లో కనిపించే ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తాయి. క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇది అనేక టెస్ట్ ట్యూబ్ పరిశోధనలలో నిరూపించారు. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కెఫీర్ సారం మానవ రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యను 56 శాతం తగ్గించిందని కనుగొన్నారు.

3. దానిమ్మ
దానిమ్మ విటమిన్ ఎ, సి, ఈ ఖనిజాలకు మూలం. ఇవి దీర్ఘాయువును పెంచుతాయి. అలాగే ఈ పండులో యాంటీ-వైరల్, యాంటీ-ట్యూమర్ గుణాలు ఉంటాయి. ఇది దీర్ఘకాలం జీవించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దానిమ్మపండ్లను ఎక్కువగా తినాలి. దానిమ్మ రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

4. పులియబెట్టిన ఆహారాలు
పులియబెట్టిన ఆహారాలు మీ జీవక్రియ రేటుని పెంచుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలతో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, దీర్ఘాయువుని అందిస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

5. ఆకుపచ్చ అరటి
ఆకుపచ్చ అరటి శరీరానికి చాలా మంచిది. ఇది కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఆహారాన్ని అందిస్తుంది. గ్రీన్ అరటిపండులో ఒక రకమైన ప్రీబయోటిక్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం పచ్చి అరటిపండు తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50 శాతం వరకు తక్కువగా ఉంటుంది.

Lunar Eclipse 2021: నవంబర్ 19న చివరి చంద్రగ్రహణం.. ఈ 2 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..

Komaki నుంచి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఇక Olaకి గట్టి పోటీ..

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..