Weight Loss With Egg: గుడ్డుతో ఈ మూడింటిని కలిపి తింటే కిలోల కొద్ది బరువు హాంఫట్.. అవేంటో తెలుసుకోండి

|

Mar 31, 2022 | 7:00 AM

Weight Loss With Egg: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని ప్రొటీన్ల రారాజుగా అభివర్ణిస్తారు. గుడ్డులో ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి.

Weight Loss With Egg: గుడ్డుతో ఈ మూడింటిని కలిపి తింటే కిలోల కొద్ది బరువు హాంఫట్.. అవేంటో తెలుసుకోండి
Egg
Follow us on

Weight Loss With Egg: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీన్ని ప్రొటీన్ల రారాజుగా అభివర్ణిస్తారు. గుడ్డులో ఖనిజాలు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అయితే.. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు గుడ్డును తినడం చాలామంచిది. అయితే గుడ్లలో మూడు ప్రత్యేకమైన పదార్థాలను కలిపి తినడం వల్ల బరువు తగ్గే ప్రక్రియలో వేగం పెరుగుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. గుడ్లతో కలిపి (Egg combinations) ఈ ఆహార పదార్థాలను కలపి తింటే.. కొన్ని వారాలలో అనేక కిలోగ్రాముల బరువును తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్డు- బచ్చలికూర: గుడ్డుతో బచ్చలికూర తీసుకోవడం వల్ల వేగవంతంగా బరువు తగ్గొచ్చు. ఒక కప్పు బచ్చలికూరలో ఏడు కేలరీలు, అనేక పోషకాలు ఉంటాయి. ఈ కాంబినేషన్ లో అనవసరమైన కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఐరన్ అధికంగా ఉండే బచ్చలికూర మన బలాన్ని, జీవక్రియను కూడా పెంచుతుంది. దీని కారణంగా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. ఆకలిని కూడా చాలా కాలం పాటు నియంత్రిస్తుంది.

గుడ్డు – కొబ్బరి నూనె: నెయ్యి లేదా ఇతర రకాల నూనెతో చేసిన ఆమ్లెట్ తినడం ద్వారా మన శరీరానికి ఎక్కువ కేలరీలు అందుతాయి. కొబ్బరి నూనె జీవక్రియను 5 శాతం పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 30 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. నెల రోజుల పాటు ప్రతిరోజూ రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల వారి నడుము పరిమాణం 1.1 అంగుళాలు తగ్గుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, నూనె లేదా వెన్నకు బదులుగా కొబ్బరి నూనెతో ఆమ్లెట్ వేసుకొని తినండి.

గుడ్డు – ఓట్ మీల్: గుడ్డును ఓట్ మీల్ తో కలిపి తినడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. వోట్‌మీల్‌లో ఉండే స్టార్చ్ నెమ్మదిగా జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలిని అణిచివేసేందుకు, కేలరీలను బర్న్ చేయడానికి జీర్ణ ఆమ్లాల విడుదలను ప్రేరేపిస్తుంది. గుడ్లతో ఓట్ మీల్ తినడం వల్ల మన జీవక్రియ కూడా పెరుగుతుంది.

గుడ్డు పోషకాహారానికి పవర్‌హౌస్: గుడ్డు మన శరీరంలోని పోషకాల లోపాన్ని సులభంగా తీర్చగలదు. ఒక గుడ్డులో 75 కేలరీలు ఉంటాయి. ఇందులో 7 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. ఇదేకాకుండా, ఒక గుడ్డు తినడం ద్వారా శరీరానికి 5 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు, కెరోటినాయిడ్లు అందుతాయి. అందుకే దీనిని పోషకాహారానికి పవర్‌హౌస్ అని నిపుణులు పేర్కొంటుంటారు.

(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం నిపుణుల సూచనల మేరకే.. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అనుసరించడం మంచిది.)

Also Read:

Diabetics Summer Care: పెరుగుతున్న ఎండలు.. షుగర్ పేషెంట్స్‌కి ప్రమాదం.. కీలక సూచనలు చేసిన వైద్యులు..!

Drinking Water: వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..