Health: కాస్త ప్రయాణానికే కాళ్లు ఉబ్బిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే సరి..
ఎలాంటి అనారోగ్య ససమ్యలు లేకపోయినా ఇలాంటి సమస్యలు వస్తుంటుంది. ఎక్కువ సమయం ఒకే ప్లేస్‌లో కూర్చుని ఉండడం వల్ల కాలి నరాల్లో రక్త ప్రసరణ జరిగేప్పుడు ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో రక్తంలో ఉండే ద్రవాలు కాళ్లలోని చుట్టుపక్కల సున్నితంగా ఉన్న కణ జాలంలోకి రక్తం వచ్చి చేరుతుంది. కాళ్లు ఉబ్బడానికి ప్రధాన కారణం ఇదే. అయితే ప్రయాణం ముగిసిన తర్వాత కాస్త అటు ఇటు నడిస్తే వెంటనే వాపు తగ్గిపోతుంది. అయితే...
ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్లు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంటలకొద్దీ ప్రయాణం చేసే వారిలో కనిపించే ప్రధాన సమస్యల్లో కాళ్లు ఉబ్బడం ఒకటి. కొందరిలో కొద్దిసేపటికే కాళ్లు ఉబ్బిపోతుంటాయి. నిజానికి షుగర్ వంటి వ్యాధులతో బాధపడే వారిలోనే ఇలా కాళ్లు ఉబ్బుతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్రయాణంలో కాళ్లు ఉబ్బడం అనేది సర్వసాధారణమైన విషయం.
ఎలాంటి అనారోగ్య ససమ్యలు లేకపోయినా ఇలాంటి సమస్యలు వస్తుంటుంది. ఎక్కువ సమయం ఒకే ప్లేస్‌లో కూర్చుని ఉండడం వల్ల కాలి నరాల్లో రక్త ప్రసరణ జరిగేప్పుడు ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో రక్తంలో ఉండే ద్రవాలు కాళ్లలోని చుట్టుపక్కల సున్నితంగా ఉన్న కణ జాలంలోకి రక్తం వచ్చి చేరుతుంది. కాళ్లు ఉబ్బడానికి ప్రధాన కారణం ఇదే. అయితే ప్రయాణం ముగిసిన తర్వాత కాస్త అటు ఇటు నడిస్తే వెంటనే వాపు తగ్గిపోతుంది. అయితే వాపు తగ్గకుండా అలాగే ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. వాపు తగ్గకుండా, అలాగే పెరుగుతుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇదిలా ఉంటే కాళ్లు వాపు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించొచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..
* గంటల తరబడి ప్రయాణం చేసే సమయంలో ఎప్పుడూ ఒకే పొజిషిన్‌లో కూర్చోకూడదు. కొద్దిసేపు కాళ్లు ముడుచుకుంటే, మరికాసేపు చాపుకోవాలి. ఒకవేళ వీలైతే అప్పుడప్పుడు లేచి నిలబడాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణతో ఎలాంటి ఒత్తిడి ఎదురుకాదు, కాళ్లు కూడా ఉబ్బవు.
* కనీసం అరగంటకు ఒకసారైనా కాళ్లు, కాళ్ల మడమల్ని అటు, ఇటు తిప్పుతూ ఉండాలి. కాళ్లకు సంబంధించి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండాలి. ఇక ప్రయాణం సమయంలో వీలైనంత వరకు జీన్స్‌లాంటి బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా ఒదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి.
* ఇక కొందరికి కాళు మీద కాళు వేసుకొని కూర్చునే అలవాటు ఉంటుంది. ఇలా కూర్చోవడం వల్ల కూడా రక్త సరఫరాపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కూడా కాళ్లు ఉబ్బుతాయి. ప్రయాణాల్లో ఇలా కాళు మీద కాళు వేసుకొని కూర్చోవడం మానేయడమే బెటర్.
* ఫ్లైట్ లేదా రైలులో జర్నీ చేసే సమయంలో అప్పుడప్పడు అటు, ఇటు తిరగాలి. ఎక్కువసేపు ప్రయాణం చేసే వాళ్లు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నీటిని, పండ్ల రసాన్ని తాగుతూ ఉండాలి. దీని ద్వారా డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టడమే కాకుండా వాష్ రూమ్‌కు వెళ్లడానికైనా నడవాల్సి వస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..