Lips: ఇలా చేస్తే అందమైన పెదాలు మీ సొంతం.. నిర్జీవంగా మారిన లిప్స్‌కి..

పెదాలు నీర్జివంగా మారడం సర్వసాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. దీంతో చాలా మంది లిప్‌ బామ్స్‌, లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే వీటిలో ఎంతో కొంత కెమికల్స్‌ కలిపే ఉంటారు. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ పాటించడం ద్వారా మీ పేదాలను సహజ పద్ధతుల్లో అందంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంతకీ పెదాలను ఆరోగ్యంగా..

Lips: ఇలా చేస్తే అందమైన పెదాలు మీ సొంతం.. నిర్జీవంగా మారిన లిప్స్‌కి..
Lips Care
Follow us

|

Updated on: Sep 29, 2024 | 1:45 PM

పెదాలు నీర్జివంగా మారడం సర్వసాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. దీంతో చాలా మంది లిప్‌ బామ్స్‌, లిప్‌స్టిక్స్‌ను వాడుతుంటారు. అయితే వీటిలో ఎంతో కొంత కెమికల్స్‌ కలిపే ఉంటారు. అయితే కొన్ని రకాల నేచురల్ టిప్స్‌ పాటించడం ద్వారా మీ పేదాలను సహజ పద్ధతుల్లో అందంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంతకీ పెదాలను ఆరోగ్యంగా ఉంచే ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గులాబీ రేకులు పెదాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. గులాబీ రేకులను పచ్చి పాలతో యాడ్ చేసి మెత్తని పేస్ట్‌లా మార్చుకోవాలి. అనంతరం ఆ పేస్ట్‌ను పెదాలపై అప్లై చేయాలి. ఇలా చేసి నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నీర్జివంగా మారిన పెదాలు తిరిగి తేమను పొందుతాయి.

* నీర్జివంగా మారిన పెదాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దాల్చిన చెక్కపొడి, తేనె ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని పెదలపై అప్లై చేసి స్ర్బ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలకు మంచి పోషణ లభించి, అందంగా మారుతాయి.

* నల్లగా మారిన పెదాలకు మళ్లీ మంచి రంగు రావాలంటే నారింజ తొక్కల పొడి ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక బౌల్‌ తీసుకొని లో రెండు టేబుల్‌స్పూన్ల నారిజం తొక్కల పొడి, బ్రౌన్‌ షుగర్‌ తీసుకొని అందులో కొన్ని చుక్కల బాదం నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసుకోవడం వల్ల పెదాల రంగు మారుతుంది.

* తేనె, బ్రౌన్‌ షుగర్‌ మిశ్రమం కూడా పెదాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. ఇందుకోసం టేబుల్‌స్పూన్‌ తేనె, బ్రౌన్‌ షుగర్‌ తీసుకొని.. అందులో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పెదాలపై రెండు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దన చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చిని నీటితో కడిగేయాలి.

* కాఫీపొడి, తేనె మిశ్రమం పెదాల ఆరోగ్యం మెరుగడుతుంది. ఇందుకోసం ఒక బౌల్​లో టేబుల్‌స్పూన్‌ చొప్పున బరకగా ఉన్న కాఫీ పొడి, తేనె తీసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో పెదాలపై నెమ్మదిగా మర్దన చేసుకొని రెండు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు. ఇలా చేస్తే పొడిబారిన పెదాలు బాగు పడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్