Bloating: కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..

అయితే తరచూ ఇలా కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటే కచ్చితంగా తీసుకునే ఆహారంతో పాటు, జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అసలు కడుపు ఉబ్బరం సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Bloating: కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే..
Bloating

Updated on: Sep 26, 2024 | 8:39 AM

కడుపు ఉబ్బరం.. వినడానికి చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదొక పెద్ద సమస్య. కాస్త భోజనం చేయగానే కడుపు బిగుతుగా మారడం, పుల్లటి తేన్పులు రావడం, కడుపులో నొప్పి. ఇలా ఎన్నో సమస్యలకు ఇది దారి తీస్తుంది. ఈ సమస్యను ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే.. మలబద్ధకం, హైపర్ ఎసిడిటీతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే తరచూ ఇలా కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటే కచ్చితంగా తీసుకునే ఆహారంతో పాటు, జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అసలు కడుపు ఉబ్బరం సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపు ఉబ్బరం రావడానికి ఒత్తిడి, ఆందోళన, పొగతాగటం, జీర్ణకోశంలో ఇన్​పెక్షన్, చిన్నపేగులలో బ్యాక్టీరియా పెరుగుదల, పొత్తికడుపులో గ్యాస్ పేరుకుపోవడం వంటివి ప్రధాన కారణాలు చెప్పొచ్చు. అంతేకాకుండా ఇదొక పోషకాహర సమస్యగా కూడా నిపుణులు చెబుతుంటారు. అందుకే ఆహారపు అలవాట్లలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య తగ్గాలంటే.. సోడా, బీర్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే.. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, బీన్స్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే యాపిల్స్, ఆప్రికాట్స్, అరటిపండ్లు, పీచెస్, బేర్రీలు వంటి పండ్లతో పాటు.. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇక ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాలు, నూనెల్లో అతిగా వేయించిన వాటికి కూడా దూరంగా ఉండాలి. మసాలాలు ఎక్కువగా తీసకోకూడదు. నాన్‌ వెజ్‌ను చాలా మితంగా తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా ఆహారాన్ని పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలి. వీటితో పాటు వ్యాయామాన్ని కూడా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా వాకింగ్, రన్నింగ్, బైకింగ్, స్విమ్మింగ్ లేదా యోగా చేయడం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తిన్నవెంటనే పడుకోకుండా కనీసం 10 నుంచి 15 నిమిషాలు నడవాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.