AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఎండను తరిమికొట్టండి, ఆరోగ్యానికి వెల్‌కం చెప్పండి.. ఈ సింపుల్‌ టిప్స్‌తో..

వేసవి ప్రారంభమవుతోంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలోనే ఎలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఎండకాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమ్మర్‌లో ఎండ తీవ్రతను తట్టుకొని ఆరోగ్యంగా..

Lifestyle: ఎండను తరిమికొట్టండి, ఆరోగ్యానికి వెల్‌కం చెప్పండి.. ఈ సింపుల్‌ టిప్స్‌తో..
Summer Tips
Narender Vaitla
|

Updated on: Mar 10, 2024 | 4:54 PM

Share

వేసవి ప్రారంభమవుతోంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలోనే ఎలా ఉంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఎండకాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమ్మర్‌లో ఎండ తీవ్రతను తట్టుకొని ఆరోగ్యంగా ఉండాలే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం సర్వసాధారణమైన విషయం. తేమ వాతావరణం, వేడి పరిస్థితుల కారనంగా శరీరం ఎక్కువగా నీటిని, శక్తిని కోల్పోతుంది. కాబట్టి వేసవిలో వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే బాగా నీరు తాగాలి.

* వేసవిలో తరచుగా పెరుగు అన్నం తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేడిని తట్టుకోవడంతో పాటు, కడుపును ఆరోగ్యం ఉంచుతుంది. రోజూ మధ్యాహ్నం కొంచెం పెరగన్నం తీసుకుంటే పేగు ఆరోగ్యాన్ని మెరుగవుతుంది.

* వేసవిలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టాలంటే తృణ ధాన్యాలను అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడంతోపాటు, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* ఇక సమ్మర్‌లో కచ్చితంగా మజ్జిగను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ మెరుగుపరచడంలో, ఉబ్బరం, మలబద్ధకం నివారించడంలో ఉపయోగపడుతుంది.

* ఇక సమ్మర్‌లో ఉదయం పూట పూరీ, దోషా వంటి హెవీ టిఫిన్స్‌ కాకుండా ఓట్స్‌ వంటి లైట్‌ టిఫిన్‌లను భాగం చేసుకోవాలని డైట్‌ నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌ను ఉదయం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియా పెరుగుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరవు.

* సమ్మర్‌లో కచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో అరటి పండు ఒకటని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో మంచి గుణాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అతిసారం, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

* వేసవిలో కచ్చితంగా కొబ్బరి నీటిని తీసుకోవాలి. ఇందులోని ఎలక్ట్రో లైట్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. ప్రతీరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల డీ హైడ్రేషన్ దరిచేరదు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us