AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ట్యాబ్లెట్స్‌ వేసుకోవడంలో ఈ తప్పులు చేస్తున్నారా.? అస్సలు ఉపయోగం ఉండదు..

జలుబు నుంచి జ్వరం వరకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ట్యాబ్లెట్‌ వేసుకుంటాం. ఎలాంటి ట్యాబ్లెట్ తీసుకున్నా జీర్ణాశయంలోకి చేరి కరిగేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అయితే ట్యాబ్లెట్స్‌ వేసుకోవడంలో కొన్ని రకాల తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: ట్యాబ్లెట్స్‌ వేసుకోవడంలో ఈ తప్పులు చేస్తున్నారా.? అస్సలు ఉపయోగం ఉండదు..
Lifestyle
Narender Vaitla
|

Updated on: Mar 10, 2024 | 6:38 PM

Share

జలుబు నుంచి జ్వరం వరకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ట్యాబ్లెట్‌ వేసుకుంటాం. ఎలాంటి ట్యాబ్లెట్ తీసుకున్నా జీర్ణాశయంలోకి చేరి కరిగేందుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అయితే ట్యాబ్లెట్స్‌ వేసుకోవడంలో కొన్ని రకాల తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ట్యాబ్లెట్‌ వేసుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ట్యాబ్లెట్స్‌ వేసుకోవడంలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా మనం ట్యాబ్లెట్‌ను వేసుకునే సమయంలో చల్లటి నీటిని తాగుతాం. అయితే అలా కాకుండా కాస్త గోరు వెచ్చని నీటిలో ఓ ట్యాబ్లెట్‌ వేసి కాసేపు ఆగి ఆ నీటిని తాగితే ట్యాబ్లెట్ త్వరగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటిలో ట్యాబ్లెట్లు కలిపి వేసుకుంటే త్వరగా చిన్న పేగులోకి వెళ్తుందని సూచిస్తున్ఆనరు.

* మనలో కొందరు ట్యాబ్లెట్ వేసుకోగానే టీ తాగుతుంటారు. ఇలా చేస్తే ట్యాబ్లెట్‌ బాగా పని చేస్తుందని భావిస్తుంటారు. కానీ దీనివల్ల సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్యాబ్లెట్ వేసుకోగానే టీ, కాఫీలు తాగితే ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎలాగో మంచివే కదా అని ట్యాబ్లెట్ వేసుకోగానే తాగితే మంచిది కాదని చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధ సమస్యలకు వాడే మాత్రలను పండ్ల రసాలతో వేసుకుంటే పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

* ఇక కొందరు ట్యాబ్లెట్స్‌ వేసుకొని ఎలాంటి నీరు తాగకుండా అలాగే ఉండిపోతారు. అయితే ఇది కూడా మంచి అలవాటు కాదని చెబుతున్నారు. ఇలా నేరుగా మాత్రలు మింగితే ఛాతిలో మంట వస్తుంది.

* ట్యాబ్లెట్‌ వేసుకోగానే ఎక్కువగా నీటిని అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి నీటిని తీసుకుంటే ట్యాబ్లెట్‌ సాంధ్రత తగ్గి సరిగ్గా పనిచేయదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us