AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ

Phani CH
|

Updated on: Feb 20, 2026 | 5:35 PM

Share

అల్లు అర్జున్ తన కెరీర్‌లో తొలిసారిగా అట్లీ (AA22), లోకేష్ కనకరాజ్ (AA23) సినిమాలతో ఏకకాలంలో బిజీగా ఉన్నారు. ప్యాన్-వరల్డ్ రేంజ్‌లో అంచనాలున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లలో, లోకేష్ కనకరాజ్ సినిమా ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. బన్నీ తన ప్రణాళికను మార్చుకుని, తక్కువ సమయంలోనే రెండు చిత్రాలను పూర్తిచేసి అభిమానులకు అందివ్వాలని చూస్తున్నారు, తన మాస్టర్ ప్లాన్ తో.

మామూలుగా అయితే ఓ సినిమా పూర్తైన తర్వాతే.. మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకొస్తుంటారు అల్లు అర్జున్. గత కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నారీయన. కానీ ఫస్ట్ టైమ్ అట్లీ సినిమా సెట్స్‌పై ఉండగానే లోకేష్ కనకరాజ్ సినిమా ఓకే చేసారు. మరి ఈ రెండింట్లో ఏది ముందు రానుంది..? అసలు లోకేష్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? అసలు బన్నీ ప్లాన్ ఏంటి..? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్ పీక్స్‌లో ఉంది. ఆయన చేస్తున్న దర్శకులు, ఎంచుకుంటున్న కథలు అన్నీ ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా అట్లీతో చేస్తున్న AA22 సినిమాపైనే ఉంది.. ఓవైపు దీని షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు లోకేష్ కనకరాజ్ స్క్రిప్ట్ మీద కూడా కూర్చుంటున్నారు. అట్లీది చిన్న సినిమా కాదు.. చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్. దాన్ని పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లైనా కావాల్సిందే. ముందు అనుకున్నంత ఈజీగా షూట్ జరగట్లేదిప్పుడు. దానికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. అందుకే అది చేస్తూనే.. లోకేష్ కనకరాజ్‌తో ఓ కమర్షియల్ సినిమా సైన్ చేసారు బన్నీ. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో AA23 సినిమా OST రికార్డులు తిరగరాస్తుంది. 1 మిలియన్ ప్లస్ రీల్స్‌తో మరే ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసింది AA23. లోకేష్ కనకరాజ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసారు. బన్నీ డేట్స్ ఇవ్వగానే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు లోకేష్. ఈలోపు ఆయన హీరోగా నటిస్తున్న DC షూట్ పూర్తి చేయనున్నారు. ఒకేసారి AA22, AA23 సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు అల్లు అర్జున్. వీలైనంత తక్కువ గ్యాప్‌లోనే రెండు సినిమాలు విడుదల చేయాలనేది బన్నీ ప్లాన్. అందులో ముందుగా లోకేష్ సినిమానే రానుంది. దీన్ని 120 రోజుల్లోనే పూర్తి చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి రెండు ప్రాజెక్ట్స్ సైమంటేనియస్‌గా పూర్తి చేస్తున్నారు ఐకాన్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vishnu Vinyasam: కామెడీతో విన్యాసాలు చేస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: ఒకటి కాదు రెండు.. చరణ్‌కు లెక్కల మాస్టారు ట్విస్ట్

Keerthy Suresh: గ్యాప్ ఇవ్వలేదు.. తీసుకున్నా అంటున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా

ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ

Follow Us