Health Tips: ఈ 6 స్టెప్‌లు మన లైఫ్‌లో పాటిస్తే.. మరణం దరిదాపుల్లోకి రాదంటే.!

| Edited By: Ravi Kiran

Feb 21, 2024 | 1:25 PM

డిజిటల్ యుగంలో అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే.. మనీ వేటలో పడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరీ పరుగులు పెడుతుంటారు. అయితే కొందరు మాత్రం బాడీ ఫిట్‌నెస్ కోసం ఏవేవో టిప్స్ పాటిస్తూ కష్టపడుతుంటారు. అయితేనేం ఎప్పుడు, ఎవరికి, ఎలా, ఏం జరుగుతుందో అని గ్యారంటీ లేదు.

Health Tips: ఈ 6 స్టెప్‌లు మన లైఫ్‌లో పాటిస్తే.. మరణం దరిదాపుల్లోకి రాదంటే.!
Lifestyle Tips
Follow us on

డిజిటల్ యుగంలో అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే.. మనీ వేటలో పడి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరీ పరుగులు పెడుతుంటారు. అయితే కొందరు మాత్రం బాడీ ఫిట్‌నెస్ కోసం ఏవేవో టిప్స్ పాటిస్తూ కష్టపడుతుంటారు. అయితేనేం ఎప్పుడు, ఎవరికి, ఎలా, ఏం జరుగుతుందో అని గ్యారంటీ లేదు. ఈ మధ్య ఎక్కడ చూసినా కార్డియాక్ అరెస్ట్‌లు, బ్రెయిన్ స్ట్రోక్‌లు, క్యాన్సర్‌లు, అల్సర్‌లు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో జబ్బులు ఉన్నాయి.. వాటితో ప్రాణాలకు తీవ్రమైన ముప్పు. అనారోగ్య కారణాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన రెగ్యులర్ లైఫ్‌లో చిన్న మార్పులు చేసుకుంటే.. మరణ ప్రమాద స్థాయిని తగ్గించుకోవచ్చునని చెబుతున్నాయి తాజా పరిశోధనలు.

మన రెగ్యులర్ లైఫ్‌లో చిన్న మార్పులు చేసుకుంటే మరణం మనకి దూరంగా జరుగుతుందని అంటుంది ఓ పరిశోధన సంస్థ రిపోర్ట్. 2011 నుంచి 2019 వరకు జరిగిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 40 ఏళ్ల వారి నుంచి 90 ఏళ్ల వయసు ఉన్న దాదాపు ఏడు లక్షల మందిపై పరిశోధనలు చేశారు. వీరిలో 6 అంశాలపై ఫోకస్ చేయగా.. 6 అంశాలను ఫాలో అయ్యేవారితో పోల్చితే.. ఫాలో కానివారిలో మరణ ప్రమాద శాతం ఎక్కువ ఉందని పరిశోధనలో వెల్లడైంది.

ఇంతకీ ఏంటి ఆ 6 అంశాలు అని ఆలోచిస్తున్నారా.? అంత ఆలోచన అక్కర్లేదని.. కంగారు అవసరం లేదు. ఎందుకు అంటే మనం రెగ్యులర్‌గా లైఫ్‌లో మార్పు కోసం చేయాలనుకున్నవి.. చేయలేక ఆపేసినవి. రెగ్యులర్‌గా శారీరకంగా చురుగ్గా ఉండాలంటే రోజూ కనీస వ్యాయామం చేయాలి. దీంతో దాదాపు 46 శాతం మరణంను తగ్గించవచ్చు అని రిపోర్ట్. మద్యం అలవాటు బాగా తగ్గించుకోవటం, సిగరెట్ అలవాటు పూర్తిగా లేకపోవడం,హెల్తీ ఫుడ్ తీసుకోవడం, ప్రతి రోజూ కనీసం 7 గంటల నిద్రపోవటంతో పాటు ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనతో ప్రశాంతంగా ఉండడం లాంటివి పెంపొందించుకోవాలని ఈ పరిశోధనా రిపోర్టు సూచిస్తోంది. ఈ ఆరు అంశాలు పాటిస్తే మరణం మనకు దూరంగా ఉంటుందని.. పై ఆరు అంశాలను పాటిస్తే 73 శాతం మరణాన్ని దూరంగా పెట్టవచ్చునని రిపోర్ట్ చెబుతోంది.