ఫిట్‌నెస్ విషయంలో చాలా సీరియస్ ఉన్న బాలీవుడ్ నటీనటులలో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. అందుకోసమే ఆమె తరచూగా జిమ్‌కు వెళ్తుంటుంది. ఇంకా తన ఫిట్‌నెస్‌తో అభిమానులను కట్టిపడేవేయడంలో కూడా సారా తక్కువేం కాదు. సారా స్పెషాలిటీ ఏమిటంటే.. గంటల తరబడి జిమ్‌లో గడుపుతూ చెమటలు కక్కేలా వర్క్ అవుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. వర్కవుట్‌లతో పాటు, నిత్యం యోగా కూడా చేస్తుంది ఈ బాలీవుడ్ నటి. అయితే ఇప్పుడు సారా చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎంతగా అంటే ఆ వీడియో బయటకు వచ్చి 20 గంటలు కూడా గడవక ముందే దాదాపు 332,800 మంది దానిని లైక్ చేశారు. అంతమంది లైక్ చేశారంటే ఇంకెంత మంది చూసి ఉంటారో కదా ..
ఈ వీడియోలో సారా అలీ ఖాన్ పలు రకాల వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటుంది. మరి రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో ఫిట్‌గా కనిపించాలంటే తప్పక సారా అలీ ఖాన్‌ను ఫాలో కావల్సిందేనని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఓ సారి ఈ వీడియోను చూడండి.. ఫాలో అయిపోండి.
సారా అలీ ఖాన్ తన ఫిట్‌నెస్ వీడియోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ మండే మోటివేషన్.. నిజం చెప్పాలంటే క్రిస్మస్ వేడుకల కోసం సిద్ధపడుతున్నా’’ అని సారా తన వీడియోకు కాప్షన్ రాసింది.
సారా అలీ ఖాన్ స్క్వాట్స్, పుష్-ప్రెస్ వంటి వర్క్ అవుట్స్ చేస్తూ ఉన్న దృశ్యాలను మనం తాను పోస్ట్ చేసిన వీడయోలో చూడవచ్చు. ఇంకా త్రెడ్ మిల్ మీద నడవడం, కండరాలను టోన్ చేయడానికి క్వాడ్లు, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ చేయడం కూడా మనకు ఆ వీడియోలో కనిపిస్తాయి. ఫిట్‌నెస్ విషయంలో మీకు మోటివేషన్ కావాలంటే ఓ సారి తప్పక ఈ వీడియోను చూడండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..