Wake Up Early: పిల్లలు పొద్దున్నే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారా.. అయితే పెద్దవారు ఈ విషయాలను తెలుసుకోవలిసిందే..

|

Jan 29, 2022 | 1:37 PM

Wake Up Early in the Morning: మన పూర్వీకులు 80 ఏళ్ళు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా(Healthy) ఉండేవారు. దీనికి కారణం పోషకాహారం , సమయానికి నిద్ర అని చెప్పవచ్చు. అయితే మారుతున్న కాలంతో పాటు మనిషి,.

Wake Up Early: పిల్లలు పొద్దున్నే నిద్రలేవడానికి బద్దకిస్తున్నారా.. అయితే పెద్దవారు ఈ విషయాలను తెలుసుకోవలిసిందే..
Health Tips
Follow us on

Wake Up Early in the Morning: మన పూర్వీకులు 80 ఏళ్ళు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా(Healthy) ఉండేవారు. దీనికి కారణం పోషకాహారం , సమయానికి నిద్ర అని చెప్పవచ్చు. అయితే మారుతున్న కాలంతో పాటు మనిషి అలవాట్లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. తినే తిండి, నిద్ర పోయే సమయం.. నిద్ర లేచే సమయం ఇలా అన్ని విషయాల్లో మార్పులు వచ్చాయి. వీటితో పాటు వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే రొజూ తెల్లవారు జామున నిద్ర లేవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు తెల్లవారు జామునే నిద్ర లేవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

*ఏ వయసు వారైనా సరే తెల్లవారి జామున నిద్ర లేవడం మంచిది. ఉదయాన్నే నిద్ర లేవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో శరీరంలో విడుదల అయ్యే హార్మోన్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఉదయం శరీరానికి తగిలే చల్లని గాలి ఆహ్లాదాన్ని ఇస్తుంది. సూర్యోదయ కిరణాలు శరీరానికి డీ విటమిన్ ను అందిస్తుంది.
*తెల్లవారు జామున నిద్ర లేచి.. వెంటనే నీరు తాగడం వలన 2 సార్లు మల విసర్జన చేయడానికి సమయం ఉంటుంది. దీంతో పేగులు శుభ్రపడతాయి. అదే నిద్ర ఆలస్యంగా లేస్తే.. త్వర త్వరగా పనులు చేసుకోవాలంటే హడావిడిలో ఒకసారి మలవిసర్జన చేసి పనులలోకి వెళ్ళిపోతాం. పేగులలో ఇంకా బయటకి రావాల్సిన మలం ఉండిపోతుంది. దీంతో పేగులకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ.
*.తెల్లవారి జామున నిద్ర లేచి వ్యాయామం, యోగ వంటివి చేయడం వలన శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం.
*వేకువజామునే నిద్రలేవడం వల్ల సహజంగానే ఉదయం టిఫిన్ తినడం అలవాటు అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
*తెల్లవారు జామున నిద్రలేచేవారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు. త్వరగా లేవడం వలన శరీరం బాగా అలసిపోయి.. రాత్రి త్వరగా నిద్రపోతాం.
*ఎర్లీ మార్నింగ్ లేవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. మెదడు ఉదయం సమయంలో అత్యంత వాంఛనీయ స్థాయిలో ఉంటుంది.ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సరైన సమయం..
కనుక తెల్లవారు జామున నిద్ర లేచే అలవాటుని పెద్దలు పిల్లలకు నేర్పాలి. ఉదయం 4-5 గంటల సమయంలో లేచి రాత్రి 9గంటలకు నిద్రపోవాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది

Also Read:  గొల్లపూడి మారుతీరావు భార్య మృతి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసిన శివకామసుందరి