ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో బరువు తగ్గడం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన ముఖ్యమైన ట్రిక్స్, చిట్కాలను షేర్ చేస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పొట్ట దగ్గర కొవ్వుని కరిగించడానికి సంబంధించి షేర్ చేసిన ఒక చిట్కా మళ్ళీ అతని బ్లాగ్‌లలో తెరపైకి వచ్చింది. ఇది బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వినోద్ చన్నా తన వెబ్‌సైట్‌లో పొట్ట దగ్గర కొవ్వును వేగంగా కరిగించే మూడు వంటకాలను షేర్ చేశారు.
ఆహారం తినడానికి ఎక్కువ సమయం గ్యాప్ ఇవ్వద్దు. చాలా గ్యాప్ తర్వాత తేలికగా ఆహారం తిన్నా సరే ఇబ్బంది పడతారు. కడుపు ఉబ్బరం సమస్య ఎదురవుతుంది. కనుక తగినంత కాల వ్యవధిలో తగినంత ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ అలవాటు జీవక్రియకు నిరంతరం పని కల్పిస్తుంది. శరీరంలోని ప్రేగు వ్యవస్థపై ఒత్తిడి కలుగదు. కనుక పలు అధ్యయనాల ప్రకారం ఎవరైనా సరే బ్యాలెన్స్ డైట్ విధానాన్ని అనుసరించడానికి కనీసం 2 గంటలలోపు తినడం ఉత్తమమైన విధానం అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇష్టమైన జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండే బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అబ్స్ వ్యాయామం చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకోవాలని.. తొందర పడి నిర్ణయాలను తీసుకోకూడదని వినోద్ చన్నా సూచించారు. కాళ్లు, వీపు, ఛాతీ వంటి పెద్ద కండరాలపై పని చేసే ABS వ్యాయామాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ అవ్వడమే కాదు అబ్స్ ఆకారంలో వ్యాయామం చేయడం సులభం అవుతుంది.
వినోద్ చన్నా బరువు తగ్గడానికి ప్రధాన కండరాల సమూహాలను గుర్తించాడు. రెక్టస్ అబ్డామినల్, ఇంటర్నల్ ఏబ్లిక్, ఎక్స్‌టర్నల్ ఏబ్లిక్ , ట్రాన్స్‌వర్స్ ఏబ్లిక్. రెక్టస్ అబ్డామినల్, క్రాస్ క్రంచ్‌లతో పాటు లెగ్ రైజ్‌లపై పని చేసే క్రంచ్‌లు చేయాలి. వీటిని ప్లాంక్, సైడ్ ప్లాంక్ చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గ వచ్చు అని వినోద్ చన్నా రాశారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..