Over Exercise: ఫిట్‌నెస్‌ కోసం ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్లే..

త్వరగా ఫలితాలను పొందడానికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాయామం చేస్తే ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Over Exercise: ఫిట్‌నెస్‌ కోసం ఓవర్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్లే..
Fitness

Updated on: Jul 31, 2022 | 5:45 AM

Risk of Over Exercising: కరోనా నాటినుంచి చాలామంది ఊబకాయం సమస్యతో సతమతమవుతున్నారు. వర్క ఫ్రమ్ హోమ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామంది బరువు పెరిగారు. అత్యధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జిమ్‌కు వెళ్లడం, లేదా డైట్లు చేయడం లాంటివి అవలంభిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో త్వరగా ఫలితాలను పొందడానికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాయామం చేస్తే ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యధిక వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

ఆలోచించకుండా వ్యాయామం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, ఫిట్‌నెస్ సాధించడానికి రోజువారీ వ్యాయామం అవసరం, కానీ ఆలోచించకుండా ఎక్కువగా వర్కౌట్‌లు చేస్తే, అది ఆరోగ్యానికి హానికరం అని పేర్కొంటున్నారు. అన్నింటికంటే వ్యాయామశాలలో వ్యాయామం చేసేటప్పుడు మనం చేసే తప్పులు ఏమిటీ..? ఎందుకు నీరసం అవుతున్నాము.. అనే విషయాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

బిగినర్స్ ఓవర్ ఎక్సర్‌సైజ్ చేయడం: అలవాటు లేని, ఇటీవల వర్కవుట్‌లు ప్రారంభించిన వారు ఓవర్ ఎక్సర్‌సైజ్ చేయడం ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఇది వెంటిలేషన్ పెర్ఫ్యూజన్ అసమతుల్యతకు దారి తీస్తుంది. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

స్లిప్ డిస్క్ ప్రమాదం: కొంతమంది వ్యాయామశాలలో బరువు శిక్షణ సమయంలో చాలా ఎక్కువ బరువులు ఎత్తడం ప్రారంభిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇది ‘ప్రోలాప్స్డ్ ఇంటర్‌వెటెబ్రల్ డిస్క్’ లేదా స్లిప్ డిస్క్ అని పేర్కొనే వెన్నెముక డిస్క్ జారిపోయే ప్రమాదాన్ని సృష్టిస్తుంది.

త్వరగా బరువు తగ్గడానికి ప్రయత్నించవద్దు: సాధారణంగా ఊబకాయం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత త్వరగా బరువు తగ్గాలని ఎక్కువ వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు. కార్డియాక్ అరెస్ట్, మెదడు రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది. శరీరం వ్యాయామం మొత్తాన్ని తట్టుకోడానికి సిద్ధంగా లేనందున ఇది చాలా ప్రమాదకరం.

ట్రైనర్ సహాయం తీసుకోండి: ఫిట్‌నెస్ సాధించడానికి వ్యాయామాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారు నిపుణుడు లేదా శిక్షకుడి సహాయం తీసుకోవాలి. వారి సహాయం లేకుండా వ్యాయామం చేయవద్దు. ఒక వ్యాయామానికి మరొక వ్యాయామానికి మధ్య 2 నుంచి 3 నిమిషాల గ్యాప్ ఇవ్వండి. ఇది గుండెకు విశ్రాంతిని ఇస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..