Anjeer For Mens Health: ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి, సమయానికి తినకపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పురుషుల బాధ్యతలు పెరగడం వల్ల చాలామంది వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడంలేదు. అజాగ్రత్త వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా పురుషులు దీర్ఘకాలిక ప్రభావాలను నివారించవచ్చు. అందుకే పలువురు వైద్య నిపుణులు పలు సలహాలు సూచనలు చేస్తున్నారు. పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు పండ్లను, డ్రైఫ్రూట్స్‌ను ఆహారంతోపాటు తీసుకోవాలి. అలాంటి వాటిలో అంజీర్ ఒకటి. పురుషులు ప్రతిరోజూ అత్తి పండ్లను తీసుకుంటే.. దాంపత్య జీవితంలో నెలకొన్న సమస్యలు దూరమై చాలా ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వంధ్యత్వ సమస్య దూరమై.. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని పేర్కొంటున్నారు. అత్తి పండ్లను రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
మలబద్ధకం నుంచి ఉపశమనంః ఫిగ్ (అంజీర్) లో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. ఇది ఫైబర్ మూలంగా పరిగణిస్తారు. దీన్ని నిత్యం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు తప్పనిసరిగా అంజీర్ పండ్లను తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రేగు కదలికలలో సమస్యలను తొలగిస్తుంది.
బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ః అత్తి పండ్లలో పీచు ఎక్కువగా ఉండి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కావున ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇలాంటప్పుడు తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు క్రమంగా తగ్గడం మొదలవుతుంది.
గుండె జబ్బుల నివారణః భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇందులో పెద్ద సంఖ్యలో పురుషులు కూడా ఉన్నారు. పురుషులు ఏదో ఒక పనిలో పడి.. బయట దొరికే నూనె పదార్థాలను తింటారు. అటువంటి పరిస్థితిలో అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అంజీర్ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అంజీర్ పండ్లను ఇలా తినండి
అంజీర్ పండ్లను తినడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దీన్ని పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. అయితే దీన్ని డ్రై ఫ్రూట్స్ లాగా తింటే చాలా మంచిది. పురుషులు ఈ పండు ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే రాత్రిపూట నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తినండి. ఆ నీటిని కూడా తాగవచ్చు. ఇంకా రాత్రి పడుకునే ముందు అంజీర్ పండ్లను పాలలో కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం..